Skip to content
క్రైమ్ వార్తలు

Hyderabad Road Accident: శంషాబాద్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. వినాయక నిమజ్జనం నుంచి తిరిగి వస్తుండగా విషాద ఘటన..

jagan 19 Sep 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Hyderabad Road Accident: శంషాబాద్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. వినాయక నిమజ్జనం నుంచి తిరిగి వస్తుండగా విషాద ఘటన..

RTC Bus Overturns in Wanaparthy; RTC Executive Engineer Dies, 14 Injured

Hyderabad Road Accident: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌ వద్ద జాతీయ రహదారిపై పాలమాకుల గ్రామం సమీపంలో కారు కల్వర్టును ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన ఈ కుటుంబం వినాయక నిమజ్జన వేడుకలు ముగించుకుని ఇన్నోవా కారులో తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

మృతులను కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య కేతావత్ జమున (45), కాట్రావత్ మాన్‌సింగ్ (48), కేతావత్ వశ్రామ్ (45)గా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు వ్యాపారులు కాగా, ఒకరు గృహిణి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ సబావత్ అశోక్‌ను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.