మాస్ థియేట్రికల్ సినిమా.. ‘ది ప్యారడైజ్’ చెన్నై ప్రెస్ మీట్లో నాని
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. చెన్నై ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ . ‘ది ప్యారడైజ్’ 24న రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు థియేటర్లో మంచి మాస్ ఫిలిమిను చూడాలనుకుంటారు. అలాంటి గొప్ప మాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ‘ప్యారడైజ్’. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో సెప్టెంబర్ 24న చూస్తారు. మేము ఒక మంచి కథని చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో, గొప్ప మూమెంట్స్‌తో తీశాము.. చెన్నై ఎప్పుడు వచ్చినా సరే ఒక ఇంటికి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకులు నన్ను ఎంతో చక్కగా ఆదరించారు. ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 24న ‘ప్యారడైజ్’ తమిళ్లో రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది రెవల్యూషనరీ ఫిలిమ్. మదర్ ఎమోషన్ కూడా ఉంటుంది. తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అందరికీ థాంక్యూ. నాని ఒక రెబల్ క్యారెక్టర్లో కనిపిస్తారు. తన ప్రాంతం కోసం, తన ప్రజల కోసం, తన ఉనికి కోసం, తన తల్లి కోసం ఎలా పోరాడారు అనేది ఈ సినిమా ప్రధాన అంశం. డిఒపి సాయి చాలా అద్భుతమైన కెమెరా వర్క్ ఇచ్చారు. అనిరుద్ గారి మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది.స్వరూప్ మాట్లాడుతూ . మీ అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. మేము గతంలో ‘దసరా’ సినిమాతో నానితో అసోసియేట్ అయ్యాము. అలాగే ఇప్పుడు ‘ప్యారడైజ్’ సినిమాని తీసుకొస్తున్నాము. తప్పకుండా ఈ సినిమా థియేటర్లో అద్భుతంగా ఉంటుందని నమ్మకం ఉంది.
- Gurugram Spa Raid: స్పా సెంటర్ల మాటున వ్యభిచారం.. మాల్ లోపల సీన్లు చూసి ఖంగుతిన్న పోలీసులు.. గురుగ్రామ్‌లో 18 స్పాలపై రైడ్..
- Sea vs Ocean: సముద్రం vs మహాసముద్రం.. ఇవి రెండు ఒకటి కాదు.. రెండు పదాల మధ్య తేడా తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..
- Petrol Pump UPI Rules: పెట్రోల్ పంప్ డీలర్లు సంచలన నిర్ణయం.. రూ.2,000 దాటితే UPI పేమెంట్స్ బంద్.. అక్టోబర్ 15 నుంచి అమలు?
- Russia Sanctions Bill: ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం, భారత్-చైనాకు 100% టారిఫ్ ముప్పు
- Hyderabad Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. వినాయక నిమజ్జనం నుంచి తిరిగి వస్తుండగా విషాద ఘటన..