Tesla to End Cybertruck Production: సైబర్ట్రక్కు టెస్లా గుడ్‌బై.. 2027 మధ్యలో ఉత్పత్తి నిలిపివేత, సైబర్క్యాబ్పై ఫోకస్..
Tesla to End Cybertruck Production
Tesla to End Cybertruck Production: అత్యంత విలక్షణమైన ఆకృతి, భవిష్యత్ డిజైన్‌తో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య మార్కెట్లోకి వచ్చిన ‘సైబర్‌ట్రక్’ (Cybertruck) ఉత్పత్తికి ముగింపు పలకాలని ఎలక్ట్రిక్ వాహన రంగా దిగ్గజం టెస్లా (Tesla) నిర్ణయించింది. 2027 మధ్య నాటికి అమెరికాలోని టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కుల తయారీని పూర్తిగా నిలిపివేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా వెల్లడించారు. సైబర్‌ట్రక్ తయారీని ఆపివేయడం ద్వారా వచ్చే ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా స్వయంచాలక (Fully Autonomous) రోబోట్యాక్సీ అయిన ‘సైబర్‌క్యాబ్’ (Cybercab) తయారీకి మళ్లించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఉత్పత్తి నిలిపివేతకు గల ప్రధాన కారణాలు:
విక్రయాలు అంచనాలను అందుకోకపోవడం: ఏడాదికి 2.5 లక్షల సైబర్ట్రక్లను విక్రయించాలని ఎలాన్ మస్క్ ప్రారంభంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 63,000 కంటే కొద్దిగా ఎక్కువ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.
సురక్షతా నిబంధనలు & అంతర్జాతీయ మార్కెట్ ఆటంకాలు: స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో రూపుదిద్దుకున్న ఈ వాహన డిజైన్ యూరప్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో, అక్కడ విక్రయించడానికి లైన్ క్లియర్ కాలేదు.
ధర , వివాదాలు: 2019లో కాన్సెప్ట్ ప్రదర్శన సమయంలో ప్రకటించిన ధరల కంటే, 2023లో మార్కెట్లోకి వచ్చేసరికి అసలు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఎలాన్ మస్క్ చుట్టూ ఉన్న రాజకీయ-సామాజిక వివాదాలు కూడా వినియోగదారుల ఆదరణ తగ్గడానికి కారణమయ్యాయి.
సైబర్‌క్యాబ్‌కు ప్రాధాన్యం – మారనున్న టెస్లా లైనప్
సైబర్‌ట్రక్ వైదొలిగిన తర్వాత టెస్లా ప్రధానంగా ‘సైబర్‌క్యాబ్’ ప్రాజెక్టుపై దృష్టి సారించనుంది. ఎలాంటి స్టీరింగ్ వీల్, పెడల్స్, వెనుక అద్దాలు (Rearview Mirrors) లేకుండా రూపొందిస్తున్న ఈ సైబర్‌క్యాబ్ పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన ప్యాసింజర్ ట్యాక్సీగా రానుంది.
సైబర్‌ట్రక్ తయారీ నిలిచిపోతే టెస్లా ప్రయాణికుల వాహనాల విభాగానికి సంబంధించి మార్కెట్లో ‘మోడల్ 3’ (Model 3) , ‘మోడల్ వై’ (Model Y) మాత్రమే నిలవనున్నాయి. అయితే 2028 నాటికి తమ నూతన తరం ‘రోడ్‌స్టర్’ (Roadster) డెలివరీలను ప్రారంభిస్తామని కంపెనీ భరోసా ఇచ్చింది.