AP Local Elections Update: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా.. నవంబర్ 5న పోలింగ్, 7న ఫలితాలు..
Election Commission
AP Local Elections Update: ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సవరించింది. మునుపు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తూ పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలను రెండు రోజుల పాటు ముందుకు జరుపుతూ నూతన ఉత్తర్వులు జారీ చేసింది. తాజా సవరించిన షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ప్రక్రియ నవంబర్ 5వ తేదీన జరగనుంది. అనంతరం చేపట్టాల్సిన ఓట్ల లెక్కింపును నవంబర్ 7వ తేదీకి ఖరారు చేశారు.
తొలుత విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక ప్రకారం నవంబర్ 3వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 5న కౌంటింగ్ చేపట్టాల్సి ఉంది. అయితే పరిపాలనాపరమైన సౌలభ్యం, క్షేత్రస్థాయి ఏర్పాట్ల సమన్వయం , ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ తేదీల్లో ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ , ఓట్ల లెక్కింపు రెండూ రెండు రోజుల పాటు ఆలస్యంగా జరగనున్నందున, నూతన తేదీలకు అనుగుణంగా ఎన్నికల యంత్రాంగం , జిల్లా కలెక్టర్లు రీషెడ్యూల్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు , ఓటర్లు అందరూ ఈ సవరించిన తేదీలను గమనించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.