Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Global Investment Summit: నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో గ్లోబల్ సమ్మిట్.. 59 దేశాల ప్రతినిధుల రాక.. ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సర్కార్ ముందుకు..

jagan 07 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Global Investment Summit: నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో గ్లోబల్ సమ్మిట్.. 59 దేశాల ప్రతినిధుల రాక.. ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సర్కార్ ముందుకు..

Chandrababu naidu

Global Investment Summit: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం నగరం మరో అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానుంది. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఆధ్వర్యంలో 31వ ‘పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్’ (31st Partnership Summit) నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్నారు. ‘నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్’ (Navigating New World Order: Trade, Technology, Trust) అనే ప్రధాన ఇతివృత్తంతో (Theme) ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భాగస్వామ్యాలను నెలకొల్పడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం తెలిపింది

సీఎం చంద్రబాబు సమీక్ష – పెట్టుబడులకు దిశానిర్దేశం

ఈ అంతర్జాతీయ సదస్సు సన్నాహక ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ఈ వేదిక ద్వారా ప్రపంచ రంగానికి చాటిచెప్పాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సెమికండక్టర్, టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రంలోని అనుకూల వాతావరణాన్ని ప్రచారం చేయాలని, “రాష్ట్రంలో పెట్టుబడులు సురక్షితం మరియు సులభతరం” అనే బలమైన భరోసాను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు.

59 దేశాల నుంచి 1,250 మందికి పైగా ప్రతినిధులు

ఈ సదస్సుకు 59 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. మొత్తం 1,250 మందికి పైగా దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

ప్రతినిధుల వర్గంవివరాలు / సంఖ్య
మొత్తం ప్రతినిధులు1,250 మందికి పైగా
విదేశీ మంత్రులు15 మంది
అంతర్జాతీయ వక్తలు40 మందికి పైగా
విదేశీ ప్రతినిధులు350 మంది
భారతీయ ప్రతినిధులు900 మంది
కీలక దేశాలుసింగపూర్, నేపాల్, యూఏఈ, కెనడా, ఈజిప్ట్ తదితరాలు
అంతర్జాతీయ సంస్థలువరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), UNEP

6 కీలక అంశాలపై చర్చలు & 400 B2B/B2G సమావేశాలు

సదస్సులో భాగంగా ఆరు ప్రధాన రంగాలపై దృష్టి సారించి నిపుణులతో చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం-పెట్టుబడులు, వ్యవసాయం-ఆహార భద్రత, నైపుణ్యాలు-అంతర్జాతీయ ఉపాధి, టెక్నాలజీ-భవిష్యత్ పరిశ్రమలు, స్వచ్ఛ ఇంధనం సుస్థిర ,వృద్ధి వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. వ్యాపార సంస్థలు, ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు 400కు పైగా బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు గవర్నమెంట్ (B2G) సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని కూటమి ప్రభుత్వం ఆశిస్తోంది.