Skip to content
తెలంగాణ › వార్తలు

Bheem Reddy Assets Case: సస్పెండెడ్ డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులపై ఐటీ కొరడా.. రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులు అటాచ్

jagan 06 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Bheem Reddy Assets Case: సస్పెండెడ్ డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులపై ఐటీ కొరడా.. రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులు అటాచ్

DSP Bheem Reddy Remanded: అక్రమాస్తులు కేసులో డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్.. కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి సంపాదన.. ఏసీబీకి పట్టించిన వ్యక్తిగత డైరీ

Bheem Reddy Assets Case: ఆదాయానికి మించిన ఆస్తుల (DA Case) కేసులో ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆయనకు చెందినవిగా భావిస్తున్న బినామీ ఆస్తులపై తీవ్రస్థాయిలో చర్యలు చేపట్టిన ఐటీ శాఖ బెనామీ ఆస్తుల నిరోధక విభాగం, సుమారు రూ. 59.4 లక్షల విలువైన బినామీ ఇళ్లను తాత్కాలికంగా అటాచ్ (Provisional Attachment) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని ముత్తంగి ‘బృందావన్ గార్డెన్స్’ ప్లాట్‌లో 200 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన రెండు నివాస గృహాలను అధికారులు గుర్తించి జప్తు చేశారు. ప్రభుత్వ అధికారిక రికార్డులలో ఒక్కో ఇంటి విలువ రూ. 14.2 లక్షలుగా పొందుపరిచినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ విలువ దానికి రెట్టింపునకు పైగా ఉన్నట్లు ఐటీ వర్గాలు ప్రాథమికంగా లెక్కగట్టాయి. ఈ ఆస్తుల కొనుగోలు , యాజమాన్య బదిలీ వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు శోధనలో ఆధారాలు లభించాయి.

ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన లోతైన విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 2023 జూలై నెలలో ‘జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ డైరెక్టర్ జి. కల్యాణ్ బాబు ఈ రెండు ఇళ్లను ఇంద్రకిరణ్ అనే వ్యక్తికి ‘గిఫ్ట్ డీడ్’ (Gift Deed) రూపంలో ఉచితంగా రాసిచ్చినట్లు ఐటీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఎలాంటి నగదు లావాదేవీలు లేదా చెల్లింపులు జరగకుండానే ఆస్తుల హక్కులను ఇంద్రకిరణ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వ్యవహారంలో ఇంద్రకిరణ్ రెడ్డిని విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేయగా, ఆ ఇళ్ల వెనుక ఉన్న అసలు నిజమైన లబ్ధిదారుడు (Beneficial Owner) సస్పెండెడ్ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డేనని స్పష్టమైంది. ఈ బినామీ నెట్‌వర్క్‌పై ఐటీ శాఖ మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది.