Skip to content
ప్రపంచం › వార్తలు

US Midterm Election Results 2026: ‘బ్యాలెట్‌పై నేను లేను, ఉంటే క్లీన్ స్వీప్ చేసేవాళ్లం’..ఓటమికి బాధ్యత వహించేందుకు ట్రంప్ నిరాకరణ, ప్రతిపక్షాలకు సహకరిస్తానని వెల్లడి..

jagan 04 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US Midterm Election Results 2026: ‘బ్యాలెట్‌పై నేను లేను, ఉంటే క్లీన్ స్వీప్ చేసేవాళ్లం’..ఓటమికి బాధ్యత వహించేందుకు ట్రంప్ నిరాకరణ, ప్రతిపక్షాలకు సహకరిస్తానని వెల్లడి..

Trump

US Midterm Election Results 2026: అమెరికా మధ్యంతర (Midterm) ఎన్నికలలో డెమోక్రాటిక్ పార్టీ ప్రభంజనం సృష్టించి ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌ను కైవసం చేసుకోవడంపై డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. రిపబ్లికన్ పార్టీ ఓటమికి తానెంత మాత్రం బాధ్యుడిని కాదని స్పష్టం చేస్తూ.. అభ్యర్థుల లోపాలు , ఎన్నికల విధానంపైనే బాధ్యతను నెట్టివేశారు. పరాజయంపై స్వంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. ఆయన తన ‘ట్రుత్ సోషల్’ (Truth Social) ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేస్తూ, “ఈ ఎన్నికల బ్యాలెట్‌పై నా పేరు లేదు. ఒకవేళ నేనే బ్యాలెట్‌పై అభ్యర్థిగా ఉండి ఉంటే, మేం కచ్చితంగా ఏకపక్షంగా భారీ మెజారిటీతో (Landslide) విజయం సాధించేవాళ్లం” అని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు తమ సొంత కోటలైన పలు కీలక స్థానాలను కోల్పోవడంతో, ట్రంప్ వైఖరి , ఆయన ప్రచార శైలిపై పార్టీ నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విదేశాంగ విధానాలు, ఆర్థిక నిర్ణయాల ప్రభావమే పార్టీకి నష్టం చేకూర్చిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ తన వ్యాఖ్యల తీరును మార్చుకున్నారు. ‘న్యూయార్క్ టైమ్స్’ (New York Times) పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో వెలువడిన ప్రజా తీర్పును తాను సంపూర్ణంగా ఆమోదిస్తున్నట్లు (Absolutely willing to accept results) ప్రకటించారు.

హౌజ్ , సెనేట్‌లో ప్రతిపక్ష డెమోక్రాట్లు ఆధిక్యం సాధించినందున, కాంగ్రెస్‌తో వైరం కాకుండా వచ్చే రెండేళ్ల పాటు కలిసి పనిచేసేందుకు (Ready to work with Democrats) తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ స్పష్టం చేశారు. డెమోక్రాట్లు ఎన్నికల ప్రచారంలో , ఫలితాల్లో మంచి పనితీరు కనబరిచారని కొనియాడారు. ఎన్నికల్లో చట్టసభలు మారినప్పటికీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఉభయసభలలోని ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరిపి పాలన సాగిస్తానని వెల్లడించారు.