Skip to content
జాతీయం › వార్తలు

Chalo Delhi : 21వ శతాబ్దంలోనే అతిపెద్ద రాజకీయ ర్యాలీగా ఛలో ఢిల్లీ…10 లక్షల మందితో రాం లీలా కిటకిట…

Krishna Rao 01 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Chalo Delhi : 21వ శతాబ్దంలోనే అతిపెద్ద రాజకీయ ర్యాలీగా ఛలో ఢిల్లీ…10 లక్షల మందితో రాం లీలా కిటకిట…

Chalo Delhi : 21వ శతాబ్దంలోనే అతిపెద్ద రాజకీయ ర్యాలీగా ఛలో ఢిల్లీ...10 లక్షల మందితో రాం లీలా కిటకిట...

Chalo Delhi : ఢిల్లీలో ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి భారీ బలప్రదర్శనకు సిద్ధమైంది. ఎన్నికల అక్రమాలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. శనివారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రతీకాత్మకంగా ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో, ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను విపక్షాలు మరోసారి బలంగా వినిపిస్తున్నాయి.

ఈ ర్యాలీలో భాగంగా ‘చలో ఢిల్లీ’ పేరుతో మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్‌–కనాట్‌ ప్లేస్‌ కూడలి నుంచి రాంలీలా మైదాన్‌ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సుమారు 10 లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తుండగా, ఢిల్లీ పోలీసులు మాత్రం దాదాపు 50 వేల మంది వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో ఢిల్లీలో భద్రత, ట్రాఫిక్‌ ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

ర్యాలీకి చేరుకుంటున్న ఇండియా కూటమి నేతలు

రాంలీలా మైదాన్‌లో నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ ర్యాలీకి ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇది ఒక భారీ ర్యాలీగా నిలవబోతోందని ఆయన పేర్కొన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. ఢిల్లీకి చేరుకోవాలనుకుంటున్న ప్రజలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రైళ్లు, బస్సులను నిలిపివేశారని కూడా ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ఎంపీ సుఖ్‌దేవ్‌ భగత్‌ మాట్లాడుతూ.. ఈ ర్యాలీ కేవలం ఇండియా కూటమి పార్టీలకు మాత్రమే పరిమితం కాలేదని, ప్రజలందరి భాగస్వామ్యంతో జరుగుతున్న కార్యక్రమంగా మారిందని అన్నారు.

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓటర్ల హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తున్న విపక్షాలు.. ఈ ర్యాలీ ద్వారా తమ నిరసనను మరింత బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యాయి.