AP Inter Exams 2027: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్..
AP Inter Board
AP Inter Exams 2027: ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి పి. రంజిత్ బాషా గురువారం అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు, అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.
ప్రశ్నపత్రాలు, సిలబస్ విధానం
రెండో భాషా సబ్జెక్టు (పార్ట్-2) స్థానంలో ఎంపిక చేసుకునే గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, సివిక్స్ , కామర్స్ సబ్జెక్టులకు ప్రత్యేక ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి. కోర్ , అదనపు సబ్జెక్టుల విద్యార్థులకు కలిపి ఒకే ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. కొందరు బైపీసీ విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా గణితం, మరికొందరు ఎంపీసీ విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా జీవశాస్త్రం లేదా ఇతర సబ్జెక్టులను ఎంచుకున్నారు. వీరందరికీ గ్రూప్ సబ్జెక్టుల వారికి ఇచ్చే ప్రశ్నపత్రాలనే అందజేయనున్నారు. గతంలో ఫెయిలైన అభ్యర్థులకు మాత్రం పాత సిలబస్ నుంచే ప్రశ్నలు అడుగుతారని బోర్డు తెలిపింది.
ముఖ్యమైన పరీక్షల తేదీల వివరాలు:
నైతికత, మానవ విలువలు: జనవరి 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది.
పర్యావరణ విద్య పరీక్ష: జనవరి 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.
ప్రాక్టికల్ పరీక్షలు: ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రోజుకు రెండు విడతలుగా (ఉదయం 9 – మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 – సాయంత్రం 5) ఉంటాయి.
ఎన్‌ఎస్‌క్యూఎఫ్ (NSQF) స్థాయి-4 వృత్తి విద్య థియరీ పరీక్షలు: ఫిబ్రవరి 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
ప్రథమ సంవత్సరం పరీక్షల పూర్తి షెడ్యూల్:
ఫిబ్రవరి 24: ఎలక్టివ్ , భాషా సబ్జెక్టులు (తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, తమిళ్, ఒడియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పార్శీ, గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, సివిక్స్, కామర్స్)
ఫిబ్రవరి 26: ఆంగ్లం (English)
మార్చి 1: కోర్, అదనపు సబ్జెక్టులు (గణితం, సివిక్స్)
మార్చి 3: జీవశాస్త్రం, చరిత్ర
మార్చి 5: భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం
మార్చి 9: రసాయనశాస్త్రం, కామర్స్
మార్చి 12: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్
మార్చి 15 : మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ
ద్వితీయ సంవత్సరం పరీక్షల పూర్తి షెడ్యూల్:
ఫిబ్రవరి 25: ఎలక్టివ్ , భాషా సబ్జెక్టులు (తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, తమిళ్, ఒడియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పార్శీ, గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, సివిక్స్, కామర్స్)
ఫిబ్రవరి 27: ఆంగ్లం (English)
మార్చి 2: కోర్, అదనపు సబ్జెక్టులు (గణితం, సివిక్స్)
మార్చి 4: జీవశాస్త్రం, చరిత్ర
మార్చి 8: భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం
మార్చి 11: రసాయనశాస్త్రం, కామర్స్
మార్చి 13: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్
మార్చి 16: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ