Skip to content
వినోదం › వార్తలు

24న ‘జయహో రామానుజ’ విడుదల

Prajapaksham 23 Oct 2026 0 నిమిషాల పఠనం వినోదం
24న ‘జయహో రామానుజ’ విడుదల

jayaho ramanuja

లయన్‌ డా. సాయి వెంకట్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుమన్‌, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 24న ‘జయహో రామానుజ‘ సినిమా వరల్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్‌, హీరో లయన్‌ సాయి వెంకట్‌ మాట్లాడుతూ చిన్నప్పుడు రామానుజాచార్యుల వారి కథలు చదువుకున్నాను. ఆ తర్వాత కొన్నేళ్లకు పత్రికలకు రామానుజాచార్యులజీవిత కథను సినిమాగా రూపొందించాలనే సంకల్పం ఏర్పడింది. కానీ నేనే ఆ సినిమాలో రామానుజాచార్యుల వారిగా నటిస్తానని ఊహించలేదు. కులం లేదు మతం లేదు మనుషులంతా ఒక్కటే అని చాటిన మహనీయుడు ఆయన. ఈ సినిమాను నేను నిర్మించాలనేది రామానుజాచార్యుల వారి అభీష్టం. నేను ఈ పాత్ర వేషధారణలో తిరుమలకు వెళ్లినప్పుడు అక్కడ భక్తులు నాకు నమస్కరించడం నా జీవితంలో మర్చిపోలేని ఘటన అన్నారు. నటి, నిర్మాత ప్రవళ్లిక , ప్రొడ్యూసర్‌ నాగబాల సురేష్‌ , ఎపి ఫిలింఛాంబర్‌ అధ్యక్షులు ఎం. శ్రీనివాస్‌ , బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ , మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, హీరో లయన్‌ సాయి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.