Skip to content
వినోదం › వార్తలు

‘కిల్లర్‌’ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ట్రైలర్‌ రిలీజ్‌లో హరీశ్‌ శంకర్‌

Prajapaksham 23 Oct 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘కిల్లర్‌’ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ట్రైలర్‌ రిలీజ్‌లో హరీశ్‌ శంకర్‌

Harish Shankar

జ్యోతి పూర్వజ్‌, పూర్వాజ్‌, లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న సెన్సేషనల్‌సై ఫై థ్రిల్లర్‌ మూవీ ‘కిల్లర్‌’. ఈ చిత్రంలో మనీష్‌ గిలాడా, చంద్రకాంత్‌ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్‌, విశాల్‌ రాజ్‌, అర్చన అనంత్‌, గౌతమ్‌ చక్రధర్‌ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్‌ సినిమా, ఏయూ అండ్‌ ఐ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై పూర్వాజ్‌ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్‌ పూర్వజ్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కిల్లర్‌’ సినిమా ఈ నెల 30న వరల్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ రాబోతోంది. ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’ మూవీని ఓఎంజి పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్‌ను పవర్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ చేతుల మీదుగా హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా వచ్చిన డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ ఈ ఈవెంట్‌కు వచ్చాక పూర్వాజ్‌ తో మాట్లాడుతూ సినిమా బడ్జెట్‌ ఎంత అయ్యింది అని అడిగాను. ఆయన బడ్జెట్‌ ఎంతో చెప్పారు. ఆయన చెప్పిన బడ్జెట్‌లో ఇంత మంచి క్వాలిటీ సినిమా చేయడం గొప్ప విషయం. ట్రైలర్‌లోనే సినిమా క్వాలిటీ ఎంత బాగుందో తెలిసిపోతోంది. పూర్వాజ్‌, జ్యోతి ఇద్దరూ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి అభిమానులు. వారి అభిమానమే నన్ను ఈ ఈవెంట్‌కు వచ్చేలా చేసింది. పూర్వాజ్‌ మొదటి సినిమా కూడా ప్రొడ్యూసర్‌ పద్మనాభ రెడ్డి గారే చేశారు. ఈ సినిమాకు ఆయనకు బెస్ట్‌ విశెస్‌ అందిస్తున్నా. న్యూరో లింక్‌కు సంబంధించిన నేపథ్యమున్న కథ ఇది. ఈ మధ్య ఎలాన్‌ మస్క్‌ న్యూరో లింక్‌ పై పరిశోధనలు చేయిస్తున్నారు. ఈ న్యూరో లింక్‌ సూపర్‌ షీని కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతోంది. డైరెక్టర్‌ పూర్వాజ్‌ మొదటి రెండు చిత్రాలు లాక్‌ డౌన్‌ లో రిలీజ్‌ అయ్యాయి. ఇది అతనికి మూడో సినిమా. అందరు దర్శకులకు మొదటి చిత్రంతోనే పేరు రావాలనే ఏం లేదు. నేను కూడా సక్సెస్‌ కోసం చాలా వెయిట్‌ చేశాను. ఈ సినిమాతో మీరు అనుకున్న గుర్తింపు, సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నా అన్నారు.చీఫ్‌ ఎడిటర్‌ బి.మనోజ్‌ కుమార్‌, డిఒపి జగదీశ్‌ బొమ్మిశెట్టి , నటులు చందు, గౌతమ్‌ చక్రధర్‌ కొప్పిశెట్టి , ప్రొడ్యూసర్‌ పద్మనాభరెడ్డి.ఎ. హీరోయిన్‌ జ్యోతి పూర్వజ్‌, ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ పూర్వాజ్‌ పాల్గొన్నారు.