Telangana Politics: అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.. పొన్నం ప్రభాకర్ డిమాండ్.. BRS అధినేత వైఖరికి నిరసనగా 6న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా..
Telangana Minister Ponnam Prabhakar Hits Back at Pawan Kalyan Over Telangana Remarks
Telangana Politics: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించని వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యానికే అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ.. ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ధర్నా నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి వందేళ్ల నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. వెయ్యి రోజులుగా శాసనసభ్యుడిగా ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్న కేసీఆర్ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రావడం లేదని.. కనీసం తనను గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతల నుంచి పూర్తిగా పారిపోయారని ఆరోపించారు.
కేసీఆర్ వైఖరిని, ఆయన నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడానికే ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఇందిరాపార్క్ వేదికగానే కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలనలో సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిరూపిస్తామని తెలిపారు. ఈ మహా ధర్నాను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
- AP 12th PRC latest news: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..12వ పీఆర్సీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
- 28 New Zilla Parishads Established in AP: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ. 13 జెడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటు…
- New Chinese H-20 Xian bomber: చైనాకు చెందిన కొత్త H-20 బాంబర్ విమానంతో అమెరికాకు షాక్…US బి20 బాంబర్ కు పోటీ..?
- CM Revanth Reddy: ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. సమస్యల పరిష్కారానికి హామీ..
- Telangana Politics: అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.. పొన్నం ప్రభాకర్ డిమాండ్.. BRS అధినేత వైఖరికి నిరసనగా 6న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా..