10న ‘మారెమ్మ’
Maremma
రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్‌ని డిజిటల్‌గా లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ షూటింగ్ సమయంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో మాధవ్‌ను కలిశాను. నాకు అప్పుడు ‘మారెమ్మ’ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ‘మారెమ్మ’ టీజర్‌ను చూపించాడు. చాలా ఇంటెన్సిటీ ఉంది. నిజానికి ఒక డెబ్యూ హీరో తొలి సినిమా చేస్తున్నప్పుడు పాటలు, ఫైట్లు అన్నీ ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఒక ప్రేమకథతో రావాలి అనుకుంటారు అన్నారు. హీరో మాధవ్ మాట్లాడుతూ బేసిగ్గా అన్నదమ్ముల మధ్య ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో ఒక దున్నపోతుకు మరొక మనిషికి ఉండే అనుబంధం ఎలా ఉంటుందో సెప్టెంబర్ 10న మీకు కనిపించబోతుంది. ఈ కథని నా దగ్గరికి తీసుకొచ్చిన మా నిర్మాతలకు థాంక్యూ. రవితేజ ఈ సినిమా చూశారు. ఆయనకి క్లైమాక్స్ చాలా అద్భుతంగా నచ్చింది. చాలా ఎమోషనల్ అయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ దీప , డైరెక్టర్ మాంచాల నాగరాజు , నిర్మాత మయూర్ , వికాస్ వశిష్ట తదితరులు పాల్గొన్నారు.