ఫోర్బ్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
Allu Arjun
జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారతదేశంలోని టాప్ 100 ప్రముఖ సెలబ్రిటీలను సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్ ఇండియా ‘షో స్టాపర్స్ 2026’ ఎడిషన్ కవర్‌పై ఆయన తనదైన స్టైల్లో మెరిశారు. ఈ కవర్ పేజీ ద్వారా సెలబ్రిటీల ప్రభావం, క్రేజ్‌కు సంబంధించి అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన స్టార్డమ్ స్థాయి, బాక్సాఫీస్ వద్ద సత్తా, అలాగే ఒక స్టార్‌గా ఆయన అసాధారణమైన బ్రాండ్ వేల్యూ ఈ గుర్తింపుతో మరోసారి స్పష్టమైంది.తెలుగు సినిమా అల్లు అర్జున్ ప్రభావం ఎంత దూరం విస్తరించిందో చెప్పటానికి ఇదొక గొప్ప తిరుగులేని గుర్తింపు. నటన, వ్యక్తిత్వం, ప్రేక్షకులతో ఆయనకున్న అసాధారణ అనుబంధం.. ఈ అరుదైన కలయికే అల్లు అర్జున్ను జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో అప్పటికే ఉన్న ఆయన భారీ క్రేజ్ మరింత విస్తరించి, దేశవ్యాప్తంగా ఒక సాంస్కృతిక ప్రభంజనంగా మారింది. అల్లు అర్జున్ అద్భుతమైన ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఒక అసాధారణ ఫినామినన్గా అల్లు అర్జున్ సృష్టిస్తోన్న ప్రభంజనానికి ఇది మరో గొప్ప గుర్తింపుగా చెప్పొచ్చు.
- Molangur Fort in Karimnagar: కరీంనగర్ మొలంగూర్ కోటలో దూద్ బావి.. అందులో నీరు తాగితే రోగాలు నయమవుతాయా.. పురాతన బావి వెనుక కథేంటి?
- US Midterm Elections: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్న 25% మంది ట్రంప్ మద్దతుదారులు, సర్వేలో ఆసక్తికర విషయాలు..
- Saudi Arabia-Houthi Tensions: దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. యెమెన్‌లోని హూతీలకు ఆఫర్ ఇచ్చిన సౌదీ అరేబియా..
- New ₹1,000 Note With Temple Image? భారత్‌లో కొత్త రూ.1,000 నోటు విడుదల కానుందా.. కేంద్ర ప్రభుత్వ వివరణ ఇదే..
- Emergency Preparedness: అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండండి.. మూడు రోజులకు సరిపడా సరుకులు నిల్వ ఉంచుకోవాలని ప్రజలకు యూకే, జపాన్ కీలక సూచన..