Skip to content
వినోదం వార్తలు

తండ్రి ఔనత్యాన్ని చెప్పే ‘ఫాదర్‌’

Prajapaksham 28 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
తండ్రి ఔనత్యాన్ని చెప్పే ‘ఫాదర్‌’

Father

డార్లింగ్‌ కృష్ణ, ప్రకాష్‌ రాజ్‌, అమృత అయ్యంగార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఫాదర్‌’. ఈ చిత్రాన్ని ఆర్‌సి స్టూడియోస్‌ బ్యానర్‌పై ఆర్‌ చంద్రు, యమున చంద్రశేఖర్‌, ఆనంద్‌ పండిట్‌ నిర్మిస్తున్నారు. రాజమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాదర్‌, సన్‌ బాండింగ్‌ నేపథ్యంగా సాగే ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్‌ పాన్‌ ఇండియా థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఫాదర్‌ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. ‘ఫాదర్‌’ సినిమా టీజర్‌ ఎలా ఉందో చూస్తే – తండ్రి( ప్రకాష్‌ రాజ్‌ )ని దేవుడిలా కొలిచే కొడుకు కృష్ణ (డార్లింగ్‌ కృష్ణ). మళ్లీ జన్మంటూ ఉంటే కృష్ణకు తండ్రిగా పుట్టాలని కోరుకునేంత ప్రేమను గుండెల నిండా నింపుకుంటాడు తండ్రి. అంతగా ప్రేమించిన కొడుకును వదిలి తండ్రి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ ఎడబాటుకు కారణం ఏంటి, కొడుకును వదిలి తండ్రి ఎందుకు దూరంగా వెళ్లిపోవాలని అనుకున్నాడు వంటి అంశాలతో ‘ఫాదర్‌” సినిమా టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. గగనపు సూర్యుడే, వెలుగుల చంద్రుడే, ధరణికి దేవుడే నాన్నా…అంటూ వచ్చిన బీజీఎం సాంగ్‌ హార్ట్‌ టచింగ్‌ గా ఉంది. ఫాదర్‌, సన్‌ రిలేషన్‌ నేపథ్యంగా ఒక బ్యూటిఫుల్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ మూవి చూడబోతున్నామనే ఇంప్రెషన్‌ ను ఈ టీజర్‌ కలిగిస్తోంది. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్స్‌ రూప పండిట్‌, రాహుల్‌ వి దూబె, మాధవ్‌ సిరాన్‌, మ్యూజిక్‌ నకుల్‌ అభ్యంకర్‌, డిఒపి సుగ్నాన్‌, స్టంట్స్‌ వినోద్‌, డైలాగ్‌ రైటర్‌ మంజు మాండవ్య, లిరిక్స్‌ రాంబాబు గోసాల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ దయాల్‌ పద్మనాభన్‌, మౌర్య మంజునాథ్‌.