నిధి అగర్వాల్ హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం
Nidhi Agarwal
నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని లాంచ్ చేశారు.మైథాలజీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్రానికి సునీత్ పడోల్కర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా క్లాప్ ఇచ్చారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. పోస్టర్లో నిధి అగర్వాల్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఇప్పటివరకు ఆమె కనిపించని కొత్త అవతార్‌ను పరిచయం చేసేలా ఉంది.హీరోయిన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దర్శకుడు పవర్ఫుల్ కథ ని సిద్ధం చేశారు.
ఈ సినిమా టైటిల్‌తో పాటు మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు: శ్రీనివాస్ గోపిశెట్టి, నిర్మాత: సునీత్ పడోల్కర్. .
- SBI Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? పూర్తి వివరాలు
- ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి? A to Z పూర్తి వివరాలు, కావాల్సిన పత్రాలు, ఫీజు వివరాలు మీకోసం..
- SSC మెమోలో పేరు, పుట్టిన తేదీ తప్పు పడిందా? ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, మీ సేవలోనే కరెక్షన్
- kallakurichi collector: మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపుల ఆరోపణలు.. కల్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్‌పై కేసు నమోదు..
- Jensen Huang viral video: వీడియో ఇదిగో.. మా బాస్ వచ్చేశారంటూ జెన్సన్ హువాంగ్ను కౌగిలించుకున్న ఉద్యోగిని. ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ..