Hyderabad Horror: ఐడీ ప్రూఫ్ అడిగిన హోటల్ సిబ్బందిపై కర్రలతో దాడి.. వీడియో ఇదిగో..
Attack on Hotel Employees in Hyderabad
Hyderabad Shocker: హోటల్‌లో గది బుక్ చేసుకునేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు, నిబంధనల ప్రకారం ఐడీ ప్రూఫ్ అడిగిన హోటల్ ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటన భరత్‌నగర్ పరిధిలోని ‘లివింగ్ ట్రీ సూట్స్’ హోటల్ వద్ద చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం.. హోటల్‌లో రూమ్ బుక్ చేసుకునేందుకు వచ్చిన కొందరు వ్యక్తులను, నిబంధనల మేరకు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం చూపించాలని హోటల్ ఉద్యోగి ఆకాష్ కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు “మేము లోకల్.. మమ్మల్నే ఐడీ ప్రూఫ్ అడుగుతావా?” అంటూ అతనితో వాగ్వాదానికి దిగారు.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆకాష్‌ను హోటల్ బయటకు లాక్కెళ్లిన దుండగులు నడిరోడ్డుపైనే కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆకాష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో తోటి సిబ్బంది వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఘటనపై హోటల్ యాజమాన్యం, ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దాడికి పాల్పడి పరారైన నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
హోటళ్లలో గది కేటాయించే ముందు అతిథుల నుంచి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం తీసుకోవడం చట్టపరమైన నిబంధన అని పోలీసులు గుర్తు చేస్తున్నారు. నిబంధనలను అమలు చేసిన ఉద్యోగిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
- 20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్ జెబెల్ అలీలో వరుస పేలుళ్లు.. యెమెన్ క్షిపణి దాడి అనుమానాలు!
- Hyderabad Horror: ఐడీ ప్రూఫ్ అడిగిన హోటల్ సిబ్బందిపై కర్రలతో దాడి.. వీడియో ఇదిగో..
- Repo Rate Unchanged: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్బీఐ..
- Metabolic Health Crisis: భారత్‌లో మెటబాలిక్ హెల్త్ సంక్షోభం.. ఆహారం, జీవనశైలిపై ఏఐజీ డాక్టర్లు కీలక హెచ్చరిక..
- లావాదేవీలు రూ. 2 వేలు దాటితే ఛార్జీలు.. UPI చెల్లింపులపై కొత్త నిబంధనలు..