Skip to content
వినోదం వార్తలు

యాలాలో యాలాలో’ పాడుకుంటున్న రవితేజ

Prajapaksham 04 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
యాలాలో యాలాలో’ పాడుకుంటున్న రవితేజ

Irumudi song

రవితేజ హీరోగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, తన భక్తి గీతమైన మొదటి పాట ‘ఇరుముడి కట్టు’తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే జోరును కొనసాగిస్తూ, కుటుంబ బంధాలలోని ఆప్యాయతను అందంగా చాటిచెప్పే రెండవ పాట ‘యాలాలో యాలాలో’ను చిత్ర బృందం విడుదల చేసింది.
జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ, ఆర్కెస్ట్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలే అసలైన సంపద అనే భావాన్ని హృదయానికి హత్తుకునేలా చెబుతుంది. హెషామ్ అబ్దుల్ వహాబ్, సాధికా కెఆర్ ఆలపించిన తీరు పాటకు మరింత భావోద్వేగాన్ని జోడించింది.
ఈ పాట ద్వారా సినిమా ఎమోషనల్ కోర్‌ను కూడా మేకర్స్ చూపించారు. రవితేజ కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించే ఓ ఆటో డ్రైవర్‌గా కనిపిస్తారు. మద్యానికి బానిసైనప్పటికీ కుటుంబం కోసం తపించే తండ్రి పాత్రలో ఆయన సహజమైన నటన ఆకట్టుకుంటోంది. ప్రియ భవాని శంకర్ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునే భార్య పాత్రలో మెప్పించగా, బేబీ నక్షత్ర తండ్రితో విడదీయలేని అనుబంధం ఉన్న కూతురిగా మనసుని తాకింది. పాటలోని ప్రతి విజువల్, ప్రతి ఎమోషన్ సాహిత్యానికి అద్భుతంగా తోడై కుటుంబ బంధాలను ఎంతో సహజంగా చూపించింది. ఈ పాట విడుదలైన వెంటనే ప్రేక్షకులకి ఫేవరేట్ గా మారింది. ప్రియ భవాని శంకర్, బేబీ నక్షత్ర కూడా తమ సహజమైన నటనతో పాటకు మరింత బలం చేకూర్చారు. ముఖ్యంగా ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా కోరియోగ్రఫీ చేయడం విశేషం. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.