భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్.. ప్రధాని మోదీ రాకకు ముందే బలాన్ని చాటిన జగన్.. కూటమిలో కొత్త గుబులు..
YS Jagan Uttarandhra Tour
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు భారీగా ప్రజలు తరలివచ్చినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ పర్యటన విజయవంతమైందని, ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైసీపీ నేతలు తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుండగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ర్యాలీలు, 5కే రన్లతో భారీ ఎత్తున కౌంట్‌డౌన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తరుణంలో.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనూహ్యంగా ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు అయి శ్రీకాకుళం అంపోలు జైలులో ఉండటంతో.. ఆయనను ములాఖత్‌లో పరామర్శించేందుకు జగన్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించారు.
సుమారు 120 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్డు ప్రయాణంలో జగన్‌కు వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా భోగాపురం జాతీయ రహదారి సమీపంలో థ్యాంక్యూ జగన్ అంటూ ప్లకార్డులతో కార్యకర్తలు చేసిన ప్రదర్శన అందరి దృష్టినీ ఆకట్టుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తమ హయాంలోనే పునాదులు పడి భూసేకరణ పూర్తయిందని.. అసలు క్రెడిట్ వైఎస్సార్‌సీపీదేనని ఆ పార్టీ నేతలు బలంగా వాదిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం రాజకీయంగా ఉత్తరాంధ్రపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాని ప్రాంతంలో కూడా జగన్ పర్యటనకు లభించిన ప్రజాదరణ చూసి రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల రాకకు ముందే జగన్ ఉత్తరాంధ్రలో పర్యటించి, భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ప్రజల మద్దతును చాటడం ద్వారా వైఎస్సార్సీపీకి క్షేత్రస్థాయిలో బలం తగ్గలేదని స్పష్టం చేసినట్లయింది తాజా జగన్ టూర్..
- భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్.. ప్రధాని మోదీ రాకకు ముందే బలాన్ని చాటిన జగన్.. కూటమిలో కొత్త గుబులు..
- రైలులో ఎక్కువ లగేజీ తీసుకెళ్తున్నారా? భారత రైల్వే కొత్త రూల్స్ తెలుసుకోండి
- ఏపీలో కూటమికి బీటలు…టీడీపీ, వైసీపీలను ఒకేసారి ఎన్నికల్లో ఓడించిన జనసేన…ఇది దేనికి సంకేతం…
- Peddi Sudarshan Reddy: నర్సంపేటకు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బీఆర్ఎస్ నేతలు..ఎవరేమన్నారంటే..
- భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం