ఓం’ .. అక్టోబర్ 16న విడుదల
Dhanush and Mammootty’s film OM, to be released in October 16, 2026
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో ‘ఆర్ టేక్ స్టూడియోస్’, ‘వండర్‌బార్ ఫిలిమ్స్’ సంయుక్తంగా #D55 ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. ‘అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా..
వండర్‌బార్ ఫిలిమ్స్’ ప్రతినిధి శ్రేయస్ మమాట్లాడుతూ ‘దర్శకుడు రాజ్ కుమార్ ధనుష్ గారికి నా కృతజ్ఞతలు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. నా సినీ ప్రయాణంలో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రమని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా, ‘ఆర్ టేక్ స్టూడియోస్’తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో వారికి ఇదే మొదటి చిత్రం. మా జర్నీ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని నేను భావిస్తున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఇతర అప్‌డేట్స్ అందరినీ అలరిస్తాయని ఆశిస్తున్నాను. ఇది అందరినీ సంతృప్తిపరిచే చిత్రంగా ఉంటుంది. అక్టోబర్ 16న ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి. మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.