dharmendra pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ఎం.జె. అక్బర్ తర్వాత వివాదాల మధ్య పక్కకు తప్పుకున్న తొలి కేంద్ర మంత్రి..
Dharmendra Pradhan Becomes First Union Minister to Quit Over a Row Since MJ Akbar in 2018
dharmendra pradhan: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రజా నిరసనలకు లేదా ఆరోపణలకు లొంగి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం సాధారణ విషయమేమీ కాదు. అది బీజేపీ పార్టీలో ఉండి చేయడం అంటే మాములు విషయం కాదు. ఎంతలా అంటే దీనికి సమాంతరమైన సంఘటనను చూడాలంటే ఆరేళ్ల క్రితం.. అంటే 2018లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎం.జె. అక్బర్ రాజీనామా చేసిన సందర్భం వరకూ కాలాన్ని వెనక్కి తిప్పాల్సి ఉంటుంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ కేంద్రంగా బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో గత నెల రోజులుగా సాగిన విద్యార్థుల పోరాటానికి ఈ రాజీనామా ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక పరిహారం అందించడం.. నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయకపోవడం వంటి నిరసనకారుల ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపినప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని ఆందోళనకారులు పట్టుబట్టారు. తదుపరి విడత చర్చలకు మంత్రి రాజీనామానే ప్రధాన ముందస్తు షరతుగా సీజేపీ విధించడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు.
పదవి నుండి వైదొలిగిన అనంతరం 57 ఏళ్ల ధర్మేంద్ర ప్రధాన్ సామాజిక మాధ్యమం X (ట్విట్టర్)లో ప్రకటన విడుదల చేస్తూ భావోద్వేగానికి గురయ్యరు. నీట్ పేపర్ లీక్ పరిణామాలకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద నెలకొన్న పరిస్థితిని దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి దుర్వినియోగం చేసుకోకుండా చూడడం.. జాతీయ ఐక్యతను కాపాడడం, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా వారి విద్యకు భంగం కలగకుండా చూడాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నా రాజీనామా లేఖను సమర్పించాను అని పేర్కొన్నారు.
2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి.. ఎంతటి వివాదాలు ఎదురైనా మంత్రులు రాజీనామా చేయకపోవడంపై.. ప్రతిపక్షాలు నిరంతరం విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 2018లో #MeToo ఉద్యమం సమయంలో పత్రికా సంపాదకుడిగా ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో ఎం.జె. అక్బర్ విదేశాంగ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆనాడు ఎం.జె. అక్బర్ రాజీనామా ఎదుర్కొన్న ఆరోపణల స్వరూపం వేరైనప్పటికీ.. ఒక వివాదం కారణంగా మోదీ మంత్రివర్గం నుండి నిష్క్రమించడం అనేది ఎం.జె. అక్బర్ తర్వాత ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలోనే పునరావృతమైంది.