Big Breaking News, Dharmendra Pradhan Resigns : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…బొద్దింకల విజయం..
Dharmendra Pradhan Resigns: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. బొద్దింకల దెబ్బకు దిగొచ్చిన కేంద్రం మంత్రి.. దేశ యువత ఆకాంక్షలు, భావోద్వేగాల పట్ల విశ్వాసం ఉందని తెలిపిన ప్రధాన్..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో రాజీనామా
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే మొదటి డిమాండ్‌గా పెట్టిన సీజేపీ
సీజేపీ విధించిన డెడ్‌లైన్ లోగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నీట్ పేపర్ లీక్ జరిగినప్పటి నుంచి దిల్లీ జంతర్‌మంతర్ వద్ద తీవ్ర ఆందోళనలు
కాసేపట్లో మరోదఫా చర్చలు జరగాల్సిన ఉండగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన ఉధృత ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన బహిర్గతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంలో ప్రజా ఒత్తిడికి తలొగ్గి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తన రాజీనామా లేఖలో ప్రధాన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు:
“జంతర్ మంతర్ తో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఈ పరిణామాలను దేశవ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడటానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. జాతీయ ఐక్యతను కాపాడటం, ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా చూసుకోవడం, మన పిల్లలు వారి చదువులపై, కెరీర్‌పై దృష్టి సారించేలా చేయడం నా బాధ్యత. అందుకే నా రాజీనామాను గౌరవ ప్రధానమంత్రికి సమర్పించాను.” తనకు మార్గదర్శకత్వం వహించిన ప్రధాని మోదీకి, సహచర మంత్రులకు, విమానశాఖ/విద్యాశాఖ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో జగన్నాథుని ఆశీస్సులతో దేశానికి, ఒడిశా ప్రజలకు, యువత ఆకాంక్షల నెరవేర్పుకు నిరంతరం కృషి చేస్తానని లేఖలో పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. దేశవ్యాప్తంగా మిన్నంటిన ఆగ్రహం
గత కొన్ని వారాలుగా క్వశ్చన్ పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభిజీత్ దీప్కే, ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ ప్రారంభించిన ఇంటర్నెట్ ఉద్యమం కొద్ది రోజుల్లోనే విద్యార్థులు, యువత, ప్రతిపక్షాలను ఏకం చేసి మహా ఉద్యమంగా మారింది గత సోమవారం (జులై 20న) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, RAF రక్షణ దళాలు విచక్షణారహితంగా లారీఛార్జ్ చేయడంతో ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా బలంగా వినిపించింది.
ప్రతిపక్షాలు, CJP పట్టుబట్టడంతో దిగివచ్చిన సర్కార్
కేంద్ర ప్రభుత్వం CJP ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ప్రధాన్ రాజీనామా విధిగా జరగాల్సిందేనని, లేదంటే ఒకటి రెండు రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు స్పష్టం చేశారు. మరోవైపు పార్లమెంట్లో పేపర్ లీకేజీలు, విద్యా సంబంధిత సమస్యలపై చర్చ జరగాలంటే ముందుగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు భీష్మించుకూర్చోవడంతో కేంద్రం చివరికి దిగిరాక తప్పలేదు.