Skip to content
జాతీయం వార్తలు

Breaking News: కాక్రోచ్ ల దెబ్బకు దిగొచ్చిన కేంద్రం… CJPతో ముగిసిన కేంద్రమంత్రుల చర్చలు..రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ అల్టిమేటం..

Prajapaksham 24 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Breaking News: కాక్రోచ్ ల దెబ్బకు దిగొచ్చిన కేంద్రం… CJPతో ముగిసిన కేంద్రమంత్రుల చర్చలు..రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ అల్టిమేటం..

cjp meeting with union ministers jp nadda jitendra singh ultimatum

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ చర్చల్లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా మూడు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, మరణించిన నీట్ (NEET) విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలని, అలాగే నిరసనకారులపై నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చామని CJP ప్రతినిధులు ప్రకటించగా, కేంద్రంతో మరింత చర్చించిన తర్వాత రేపు మధ్యాహ్నం మరోసారి CJP సభ్యులతో భేటీ అవుతామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో సీజేపీ పట్టుదలతో ఉంది. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇవ్వడంతో పాటు, నిరసన చేస్తున్న విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవడంపై కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరిని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇండియా టుడే వెబ్ సైట్ రిపోర్ట్ చేసింది.

కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా ఇలా అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా మంత్రివర్గం నుండి ఆయనను తొలగించడం తప్ప మరేదీ తమ డిమాండుకు సరిపోదని మేము ప్రభుత్వానికి చెప్పామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ నిరసనలు జరుగుతున్నాయని, యువతలోని ఆగ్రహం, భావోద్వేగాలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయని అశుతోష్ తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని వివరంగా చర్చించింది. స్పందించడానికి రేపు మధ్యాహ్నం వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం రాజీనామాపై నిర్ణయం తీసుకోకపోతే, నిరసనలు మరింత విస్తరిస్తాయి, అప్పుడు సీజేపీ మరో నిర్ణయం తీసుకోవలసి వస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, సమావేశం కొద్దిసేపు మాత్రమే జరిగిందని తెలిపారు. సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లు, పరీక్షల సంస్కరణల కోసం ఐదు సూచనలు చేసిందని ఆయన అన్నారు. రేపు మధ్యాహ్నం మళ్లీ సమావేశమై ప్రభుత్వంతో జరిపిన చర్చల వివరాలను వారికి తెలియజేస్తామని చెప్పామని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు: CJP CJP demand CJP march CJP news