Skip to content
జాతీయం వార్తలు

Kharge Targets PM Modi: అర్ధరాత్రి వీడియో ప్రకటనలు కాదు..దమ్ముంటే పార్లమెంట్‌లో ప్రకటన చేయండి.. ప్రధాని మోదీకి కౌంటర్ విసిరిన మల్లిఖార్జున ఖర్గే

Prajapaksham 24 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Kharge Targets PM Modi: అర్ధరాత్రి వీడియో ప్రకటనలు కాదు..దమ్ముంటే పార్లమెంట్‌లో ప్రకటన చేయండి.. ప్రధాని మోదీకి కౌంటర్ విసిరిన మల్లిఖార్జున ఖర్గే

Kharge Targets PM Modi: అర్ధరాత్రి వీడియో ప్రకటనలు కాదు..దమ్ముంటే పార్లమెంట్‌లో ప్రకటన చేయండి.. ప్రధాని మోదీకి కౌంటర్ విసిరిన మల్లిఖార్జున ఖర్గే

Kharge Targets PM Modi: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో నీట్ (NEET) పేపర్ లీకేజీల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సభలో నేరుగా మాట్లాడకుండా.. సోషల్ మీడియా వీడియోల ద్వారా సందేశాలు విడుదల చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. దేశాన్ని ఉద్దేశించి అర్ధరాత్రి వీడియో ప్రకటనలు చేస్తూ ఏకపక్షంగా మన్ కీ బాత్ వినిపించాల్సిన అవసరం లేదని.. నిజాయితీ ఉంటే సభలోనే సమాధానం చెప్పాలని ఆయన ఘాటుగా విమర్శించారు.

నీట్ లీకేజీలపై రాబోయే వారంలో కఠిన నిబంధనలతో కొత్త బిల్లును ప్రవేశపెడతామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటును కేబినెట్‌లో చర్చిస్తామని చెబుతూ ప్రధాని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఈ ప్రకటనపై స్పందించిన ఖర్గే.. పార్లమెంట్ సాక్షిగా చర్చను పక్కనబెట్టి బయట మాట్లాడటం సభా హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. విద్యా వ్యవస్థ, పరీక్షల నిర్వహణపై సభలో సమగ్ర చర్చ జరగాలంటే ప్రభుత్వం ముందుగా కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు:

పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఖర్గే స్పష్టం చేశారు. అలాగే లీకేజీల వల్ల భవిష్యత్తు అంధకారమై తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థులకు ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, బలప్రయోగానికి ఆదేశించిన అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాథమిక డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే విద్యావ్యవస్థపై పార్లమెంట్‌లో చర్చకు తాము సిద్ధంగా ఉంటామని ఖర్గే ఖచ్చితంగా వెల్లడించారు.