సెప్టెంబర్ 10న వస్తున్న ‘మారెమ్మ’
సెప్టెంబర్ 10న వస్తున్న ‘మారెమ్మ’
హీరో రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మారెమ్మ’ ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్ ‘బావ బావ’ సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 10న విడుదల చేస్తామని నిర్మాత మయూర్ రెడ్డి బండారు తెలిపారు. దర్శకుడు మంచాల నాగరాజు మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. విడుదలకు సిద్ధంగా ఉన్నాం. తెలుగులో ఇది చాలా కొత్త స్క్రీన్‌ప్లేతో ఉండే సినిమా. ‘మారి’ పాటలో తమోగ్న, సర్కార్ ఇద్దరూ చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. మంగ్లీ కూడా అద్భుతంగా పాడారు. అలాగే మిట్టపల్లి సురేందర్ ఎంతో మంచి సాహిత్యం అందించారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. ‘మారెమ్మ’ ఒక రూటెడ్ విలేజ్ స్టోరీ. ఈ సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించడానికి మేమంతా ప్రయత్నించాం అన్నారు. మాధవ్ సరసన దీపా బాలు హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి, బాల నటులు తమోజ్ఞ సర్కార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఎడిటర్ సాయిబాబు, సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్, యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్, కొరియోగ్రాఫర్: సాగ్గీ సాగర్, సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్.