Skip to content
తెలంగాణ వార్తలు

We Will Win 117 Seats: వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తాం.. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద నుంచి తరిమికొడతాం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Prajapaksham 10 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
We Will Win 117 Seats: వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తాం.. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద నుంచి తరిమికొడతాం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

We Will Win 117 Seats: వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలిచి అధికారం ఏర్పాటు చేస్తాం.. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద నుంచి తరిమికొడతాం.. రైతు ఆశీర్వా సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

We Will Win 117 Seats: ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు ఆశీర్వా సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీ, కల్వకుంట్ల కుటుంబమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కౌరవ వంశమైన కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ నుంచి శాశ్వతంగా తరిమికొడతామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను ‘రాక్షస పాలన’గా అభివర్ణించిన ఆయన.. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మళ్లీ గెలిచేది తామేనని.. భద్రాచలం రాముడి సాక్షిగా 117 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా బ్రేక్ వేశారు. తెలంగాణలో 2028లో ఎన్నికలు రావని.. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత 2029 జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ఆ సమయానికి తెలంగాణలో పార్లమెంట్ స్థానాల సంఖ్య 26కు, అసెంబ్లీ స్థానాల సంఖ్య 182కు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజాపాలనను ఆశీర్వదించడానికి వచ్చిన జనసందోహానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఖమ్మం జిల్లా ఎల్లప్పుడూ తనకు గుండె లాంటిదని రేవంత్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధర అడిగిన పాపానికి గిరిజన రైతులకు బేడీలు వేసి అవమానించారని.. కానీ తాము చెప్పింది చెప్పినట్లు చేయడం వల్లే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని గుర్తుచేశారు.

రాజకీయ విమర్శలతో పాటు రైతులకు పెట్టుబడి సాయం అందించేలా ఈ వేదిక నుండి సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘రైతు భరోసా’ పథకం కింద తాజాగా మరో రూ. 1,009 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 74 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందగా, తాజా నిధులతో కలిపి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రైతు భరోసా కింద మొత్తం రూ. 8,759 కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినట్లయింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పడానికి ఈ నిధుల విడుదలే నిదర్శనమని సీఎం పేర్కొన్నారు.