Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విజయ్ బాటలో జూనియర్ ఎన్టీఆర్.. ఇదే సరైన సమయమా…?

Prajapaksham 10 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
విజయ్ బాటలో జూనియర్ ఎన్టీఆర్.. ఇదే సరైన సమయమా…?

తమిళనాడులో విజయ్ చేసిన ప్రయోగం ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా అగ్ర హీరోలు రాజకీయాల వైపు చూసే విధంగా చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారతదేశంలో మరే భాషలో లేనటువంటి విధంగా తెలుగులో సూపర్ స్టార్లు చాలామంది ఉన్నారు టైర్ వన్ హీరోలుగా పేర్కొనబడే వారిలో మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ముఖ్యమైన హీరోలుగా చెప్పవచ్చు. ఇక సీనియర్ హీరోల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే రాజకీయాల్లో ఒక రాయి వేసి పక్కకు తప్పుకొని బుద్ధిగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యేగా అటు రాజకీయాలతో పాటు శనివారం లో కూడా కొనసాగుతూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. అయితే బాలకృష్ణ కు ఉన్న అడ్వాంటేజ్ చిరంజీవి కి లేదు. . అందువల్లే చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. . ఇక టైర్ వన్ హీరోలలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నారు. ఇక కొత్త హీరోలు ఎవరు రాజకీయాల్లోకి వస్తారా అని ఆలోచిస్తున్నారా కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజకీయాల పైన అంతో ఎంతో ప్రవేశం ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు వద్దనుకున్న అందరూ జూనియర్ వైపు చూపిస్తాయి. ఎందుకంటే జూనియర్ 2009లోనే తెలుగుదేశం కండువా కప్పుకొని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని ప్రచారం చేసిన చరిత్ర ఉంది. మూడు పదుల వయసు రాకముందే జూనియర్ ఎన్టీఆర్ అటు వైయస్సార్, ఇటు చిరంజీవి, అటు కేసీఆర్ లాంటి ఉద్దండులను మించిన ఆకర్షణ ఆయన సభలకు లభించింది అంటే మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నెమ్మదిగా రాజకీయాల నుంచి తప్పుకొని పూర్తిగా సినిమా కెరియర్ వైపు వెళ్లిపోయారు.

ఇప్పుడు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం వైపు అందరి చూపు పడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రం తమిళనాడులో హీరో విజయ్ కేవలం ఏడాది క్రితం పార్టీ స్థాపించి తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యే స్థాయిలో విజయం సాధిస్తాడని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఏ హీరో కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు తిన్న దెబ్బలు చూసి చాలామంది హీరోలు రాజకీయాలు వద్దని పక్కకు తప్పుకున్నారు. అంతెందుకు తమిళనాడులో రజనీకాంత్ చిరంజీవి అనుభవాలను చూసి రాజకీయాల్లోకి రావాలన్నా కోరికను సైతం చంపేసుకుని సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇక కమల్ హాసన్ నామ్ కే వాస్తే ఒక పార్టీని పెట్టుకొని తూతూ మంత్రం చేస్తున్నారు తప్ప సీరియస్ పొలిటిషన్ కాదు. ఇక విజయ్ ఒక్కడు మాత్రమే ఎవరు ఊహించని విధంగా రాజకీయ పార్టీని స్థాపించి, ఏడాది తిరిగేలోగా కాకలు తీరిన డిఎంకె పార్టీని ఢీ కొట్టి పడగొట్టి సీఎం పదవిని చేపట్టి మొత్తం దేశాన్ని షాక్ కి గురి చేశాడు.

విజయ్ చేసిన ఈ ప్రయోగం చాలామంది హీరోల్లో మళ్లీ రాజకీయాల్లో తమ అదృష్టం పరీక్షించుకోవచ్చు అనే కోరికను కలిగించింది అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే రాజకీయాల వైపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ వంటి వారు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవుతాడు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. అయితే జూనియర్ మాత్రం ఆచితూచి వ్యవహరించాలని చూస్తుంటే, సడన్గా విజయ్ చూపించిన మార్గం మాత్రం జూనియర్ ను ఆకర్షించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు సైతం భావిస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి కొడాలి నాని ఓ మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై సినిమాలు చేస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదని 60వ సంవత్సరాలు వచ్చే వరకు వెయిట్ చేయవద్దని రాజకీయాల్లో అవకాశం ఎప్పుడు లభిస్తే ఎంట్రీ ఇవ్వాలని, లేట్ చేస్తే ఫలితం ఉండదని కుండబద్దలు కొట్టి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ పరిణామాలు అన్నింటిని గమనిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ సైతం కేవలం చంద్రబాబు నాయుడు లోకేష్ పైన ఆధారపడి ఉంది.

చంద్రబాబు నాయుడు వయస్సు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఈ వయసు ఇప్పటికే ఏడు పదులు దాటి 80 వ సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అంత యాక్టివ్ గా ఉండకపోవచ్చు అని సన్నిహిత వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఈ లోగా లోకేష్ కనుక పార్టీ పగ్గాలు చేపడితే మంచిదని కూడా భావిస్తున్నాయి. ఇప్పటికే లోకేష్ ఆంధ్రప్రదేశ్ షాడో సీఎంగా కొనసాగుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీని ఎంచుకుంటే ఆయనకు స్వాగతం లభించకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. బదులుగా కొత్త పార్టీని స్థాపించి విజయ్ తరహాలో సరిగ్గా ఎన్నికలకు రెండేళ్ల ముందు ప్రవేశించి చక్కగా ప్రచారం చేసుకుంటే, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఓట్లుగా మలిచి జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి గడచిన రెండేళ్లలో ఓటమి నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అటు ప్రతిపక్ష నేత జగన్ సైతం కేసుల ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకు కదులుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే కూటమిలో ఉండి అధికారం అనుభవించిన నేపథ్యంలో 2029 ఎన్నికల్లో అధికార పక్షం ఎదుర్కొనే వ్యతిరేకత ఆయన కూడా మోయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక అధికార ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని జూనియర్ ఎన్టీఆర్ కనుక చక్కగా వాడుకొని తమిళనాడు తరహాలో కొత్త పార్టీతో ఎంట్రీ ఇస్తే సూపర్ హిట్ అవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పుడైతే జూనియర్ చేతిలో వరుసగా సినిమాలు ఉన్నాయి అన్ని కూడా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టు లే… ఇవన్నీ పూర్త అవ్వాలంటే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు పైనే కాలం పట్టే అవకాశం ఉంది. మరి జూనియర్ మదిలో ఏముందో ముందు ముందు తెలుస్తుంది అప్పటివరకు వేచి చూడాల్సిందే.

ట్యాగ్‌లు: andhra pradesh jr ntr Vijay