Delhi Viral Video: ఢిల్లీ వీధుల్లో యువతిపై ఆర్ఎస్ఎస్ గూండాల దాడి…ప్రేక్షకులుగా చూస్తున్న ఢిల్లీ పోలీసులు..
ఢిల్లీ వీధుల్లో యువతిపై ఆర్ఎస్ఎస్ గూండాల దాడి...ప్రేక్షకులుగా చూస్తున్న ఢిల్లీ పోలీసులు..
Delhi Viral Video: ఎంసీడీ సివిక్ సెంటర్ సమీపంలో నిరసనకారులకు, హిందుస్తాన్ రక్షా దళ్‌కు చెందినవారిగా చెప్పుకుంటున్న వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న యువతి యువకులను లాగుతూ, కొడుతూ, బెదిరించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.
Delhi Viral Video: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు జంతర్ మంతర్ వద్ద చేరుకునేందుకు వస్తున్నటువంటి వేలాదిమంది ప్రజల పైన ఢిల్లీ పోలీస్ ఉక్కు పాదం మోపింది. దాదాపు 7వేల మందిని అరెస్టు చేసి అష్టదిగ్బంధం చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ మెట్రో అలాగే ప్రజా రవాణా సదుపాయాలు అన్నింటిని నిలిపివేసింది. దీంతో వేలాది మంది ప్రజలు జంతర్ మంతర్ వైపు నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న వారి పైన ఆర్ఎస్ఎస్ గూండాలు దాడి చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని కేంద్ర ప్రాంతంలో 25 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినప్పటికీ.. సంఘ్ పరివార్ సంస్థలకు చెందిన కొందరు వ్యక్తులు నిరసనకారులు, జర్నలిస్టులను బెదిరించి, దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కన్నాట్ ప్లేస్, ఎంసీడీ సివిక్ సెంటర్ సమీపంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పాలికా బజార్ సమీపంలో బజరంగ్ దళ్‌కు చెందినవారమని చెప్పుకున్న 30 మందికి పైగా వ్యక్తులు జర్నలిస్టులను బెదిరిస్తూ నినాదాలు చేశారు. “మీరు సీజేపీకి అనుకూలంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. మీపై ఆయుధాలు ఉపయోగించలేకపోతున్న ఢిల్లీ పోలీసులను మేం రక్షిస్తాం” అంటూ వారిలో ఒకరు అరిచినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెబ్ పోర్టల్ తన వార్త రిపోర్టులో తెలిపారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమివేసి, అరగంట తర్వాత కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కన్నాట్ ప్లేస్‌లోనూ పోలీసుల సమక్షంలోనే కొందరు వ్యక్తులు నిరసనకారులపై దాడులకు పాల్పడినట్లు హిందుస్థాన్ టైమ్స్ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు ప్రత్యక్షంగా చూశారని ఆ పత్రిక పేర్కొంది.
ఎంసీడీ సివిక్ సెంటర్ వద్ద మహిళలపై దాడులు
ఎంసీడీ సివిక్ సెంటర్ సమీపంలో నిరసనకారులకు, హిందుస్తాన్ రక్షా దళ్‌కు చెందినవారిగా చెప్పుకుంటున్న వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న యువతి యువకులను లాగుతూ, కొడుతూ, బెదిరించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో నిరసనకారులపై కొందరు చెంపపై దెబ్బలు కొడుతూ, తన్నుతూ దాడి చేయడం కనిపించింది. ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు లాగుతూ కొట్టగా.. ఆమె సోదరి వచ్చి ఆమెను వారి నుంచి విడిపించుకుంది. “నన్ను కాపాడేందుకు ఎవరూ రాలేదు. ఢిల్లీ పోలీసులు అంతా చూస్తూనే ఉన్నారు” అని ఆ యువతి వీడియోలో పేర్కొంది. ఈ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో ఒకరిని రవీంద్ర గోవిందగా సోషల్ మీడియా పోస్టులు పేర్కొన్నాయి. అతను ఘజియాబాద్‌కు చెందిన హిందూ రక్షా దళ్ సభ్యుడని ఆ పోస్టుల్లో తెలిపారు. అదే రోజు ఉదయం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా సోషల్ మీడియా పోస్టులు పేర్కొన్నాయి. అతడికి నేర చరిత్ర ఉందంటూ ఆరోపణలు చేశాయి. అయితే, ఈ వివరాలను ధ్రువీకరించాల్సి ఉంది.
ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వీడియోల్లో యువతిపై కొందరు వ్యక్తులు పిడిగుద్దులు గుద్దడం, తన్నడం కనిపిస్తోంది. ఆమె నేలపై పడిపోయిన తర్వాత కూడా దాడి కొనసాగినట్లు వీడియోల్లో ఉంది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బాధిత మహిళను తాము రక్షించామని, ఆమెకు సహాయం అందించామని తెలిపారు.
బ్రాస్ నకిల్స్ తో దాడి.. టీషర్ట్ చించివేత
కన్నాట్ ప్లేస్ సమీపంలో చిత్రీకరించినట్లు చెబుతున్న మరో వీడియోలో, కొందరు వ్యక్తులు ఓ నిరసనకారుడిపై ఇత్తడి పిడికిలి (బ్రాస్ నకిల్స్)తో దాడి చేయడం, అతని టీషర్ట్‌ను చించివేయడం కనిపించింది. షహదారాకు చెందిన 21 ఏళ్ల మీడియా విద్యార్థి ఒకరు కూడా తనకు, తన ఇద్దరు స్నేహితులకు పోలీసులు, రైట్‌వింగ్ సంస్థలకు చెందిన వ్యక్తుల నుంచి దాడులు ఎదురయ్యాయని ఆరోపించారు.