Skip to content
తెలంగాణ వార్తలు

Heavy Rain Alert in Telangana: ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు…పలు జిల్లాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక

Prajapaksham 28 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Heavy Rain Alert in Telangana: ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు…పలు జిల్లాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక

Heavy Rain Alert in Telangana (AI Generated)

ప్రజాపక్షం/హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆది, సోమవారాల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

మంగళ, బుధవారాల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బుధ, గురువారాల్లో మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు.

శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ కాలంలో కూడా ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *