Skip to content
జాతీయం వార్తలు

తొలి తెలుగు ‘భారతరత్నం’ పివి నరసింహారావు

Prajapaksham 28 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
తొలి తెలుగు ‘భారతరత్నం’ పివి నరసింహారావు

P.V. Narasimha Rao, the first Telugu recipient of the Bharat Ratna

(నేడు శ్రీ పి.వి. నరసింహారావు జయంతి)

భారతదేశ రాజకీయ చరిత్రలో మేరునగ ధీరుడు తెలంగాణ పల్లెలో పుట్టి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన తెలంగాణ భూమి పుత్రుడు, బహుభాష ప్రజ్ఞాశీలి, రాజకీయ దురంధరుడు సరళీకృత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, దేశ ప్రగతికి బాటలు వేసిన దార్శనికుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, అఖండ భారతాన్ని ఏలిన తొలి తెలుగు తేజం కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన తెలంగాణ భూమి పుత్రుడు మన పివి నరసింహారావు. పి.రంగారావు కుమారుడైన శ్రీ పి.వి. నరసింహారావు 1921 జూన్‌ 28న కరీంనగర్‌లో జన్మించారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీలోను, ముంబయి యూనివర్శిటీలోను, నాగ్‌పూర్‌ యూనివర్శిటీలోను చదువుకున్నారు. భార్యను కోల్పోయిన పి.వి.నరసింహారావుకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయవేత్తగా, న్యాయవాదిగా ఉన్న నరసింహారావు రాజకీయాల్లో చేరి కొన్ని ముఖ్యమైన పదవు లు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో 1962 64 న్యాయ, సమాచార శాఖ మంత్రి, 1964 న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 ఆరోగ్యం, వైద్యశాఖ మంత్రి, 1968 విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1971 వరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1975 అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధానకార్యదర్శి, 1968 ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్మన్‌, 1972 నుంచి మద్రాస్‌లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షుడుగా పనిచేశారు. 1957 77 మధ్య ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ సభ్యుడుగా ఉన్నా రు. 1977 నుంచి 1984 వరకు లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 1984 డిసెంబర్‌లో రామ్‌టెక్‌ నుంచి 8వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1978 పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా లండన్‌ యూనివర్శిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఆసియన్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ నిర్వహించిన దక్షిణాసియా సదస్సులో పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్‌ ఆంధ్రప్రదేశ్‌ కేంద్రానికి చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1980 జనవరి 14 నుంచి 1984 జులై 18 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1984 డిసెంబర్‌ 31 నుంచి 1985, సెప్టెంబర్‌ 25 వరకు రక్షణ మంత్రిగా ఉన్నారు. అనంతరం 1985 సెప్టెంబర్‌ 25 మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గా బాధ్యత లు చేపట్టారు. అనేక అభిరుచులు కలిగిన నరసింహారావుకు సంగీతం, సినిమా, నాటకాలంటే ఇష్టం. జ్ఞానపీఠ్‌ ప్రచురించిన స్వర్గీయ విశ్వనాథ సత్యనారాయ ణ సుప్రసిద్ధ నవల ‘వేయి పడగలు’ హిందీ అనువాదాన్ని ‘సహస్రఫణ్‌’ పేరు తో ఆయన విజయవంతంగా ప్రచురించారు. అలాగే, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన స్వర్గీయ శ్రీహరినారాయణ్‌ ఆమ్టే ప్రముఖ మరాఠీ నవల ‘పన్‌ లక్షత్‌ కోన్‌ గెటో’ తెలుగు అనువాదాన్ని కూడా ప్రచురించారు. మరాఠీ నుంచి తెలుగులోను, తెలుగు నుంచి హిందీలోను అనేక అనువాద గ్రంథాలు ప్రచురించారు. వివిధ పత్రికల్లో కలం పేరుతో అనేక వ్యాసా లు రాశారు. అమెరికా, పశ్చిమ జర్మనీలోని యూనివర్శిటీల్లో రాజకీయ అంశాలపై, అనుబంధ అంశాలపైన ప్రసంగాలు చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి హోదాలో 1974 బ్రిటన్‌, పశ్చిమ జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఇటలీ, ఈజిప్ట్‌ దేశాల్లో పర్యటించారు. విదేశాంగ మంత్రి గా ఉన్న సమయంలో అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించి ఆయన తన మేథావితనాన్ని, ప్రజ్ఞా పాటవాలను, రాజకీయ అనుభవాన్ని సమయోచితంగా ప్రదర్శిస్తూ వచ్చారు. 1980 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన యునిడో 3వ సదస్సుకు నరసింహారావు అధ్యక్షత వహించారు. 1980 మార్చిలో న్యూయార్కులో జరిగిన 77 దేశాల సమావేశానికి కూడా అధ్యక్ష బాధ్యతలు వహించారు. 1981 ఫిబ్రవరి అలీన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన నిర్వహించిన పాత్ర విస్తృత ప్రశంసలు అందుకొంది. 1981మే లో కారకస్‌లో జరిగిన 77దేశాల ఈసిడిసి సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి వ్యక్తిగతంగా నాయకత్వం వహించారు. భారతదేశానికి, భారత విదేశాంగ విధానానికి 1982, 1983 సంవత్సరాలు ఎంతో ముఖ్యమైనవి. 1982 లో అమెరికాలో జరిగిన అలీన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలకు పి.వి.నరసింహారా వు అధ్యక్షత వహించారు. 1983 నవంబర్‌లో పాలస్తీనా సమస్య పరిష్కార యత్నంలో భాగంగా పశ్చిమాసియా దేశాల్లో పర్యటించిన అలీన దేశాల ప్రత్యేక ప్రతినిధి బృందానికి నరసింహారావు నాయక త్వం వహించారు. 1984 జులై 19న నరసింహారావు హోం మంత్రి బాధ్యతలు చేపట్టారు. 1984 నవంబర్‌ 5న ఆయనకు ప్రణాళికా శాఖను కూడా అదనంగా అప్పగించారు. 1984 డిసెంబర్‌ 31 నుంచి 1985 సెప్టెంబర్‌ 25 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. 1985 సెప్టెంబర్‌ 25న మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2004 డిసెంబర్‌ 23న కన్నుమూశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పివి నరసింహారావు శతజయంతి ఉత్సవా లు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన చేసిన సేవలను గుర్తించి 2024వ సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో పివి నరసింహారావు గారిని గౌరవించడం యావత్‌ భారతజాతికి, ఆనందదాయకమైన విషయం. రచయిత- నరేష్‌ జాటోత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *