Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కూటమిలో లుకలుక… పవన్ కళ్యాణ్ అస్త్రంగా చంద్రబాబుపై దాడి ?… షా వ్యూహం…

Prajapaksham 25 Jun 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
కూటమిలో లుకలుక… పవన్ కళ్యాణ్ అస్త్రంగా చంద్రబాబుపై దాడి ?… షా వ్యూహం…

ai generated image

ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలో వచ్చిన టిడిపి జనసేన బిజెపి కూటమిలో అంతర్గతంగా లుకలుకలు మొదలయ్యాయా.,..? అంటే రాజకీయ వర్గాలు మాత్రం అవుననే సమాధానం చెబుతున్నాయి. ఎందుకంటే అటు బిజెపి దక్షిణ భారతదేశంలో విస్తరించాలంటే ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే తమిళనాడులో అటు ఏఐఏడీఎంకే, డిఎంకె పార్టీలు అధికారంలో లేకుండా పోయాయి. డీఎంకే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఇక అన్నా డీఎంకే పార్టీ చీలిపోయి విజయ్ పంచన చేరింది. ఇలా తమిళనాడు రాజకీయంలో ప్రాంతీయ పార్టీలు దెబ్బతినడం చూడవచ్చు. అదే తరహాలో కర్ణాటకలో జేడీయు సైతం ఎన్డీఏ లో ఉన్నప్పటికీ తన ప్రభావం పూర్తిగా కోల్పోయి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పొత్తులో భాగంగా అతి తక్కువ సీట్లకు పోటీ చేసిన ఆశ్చర్యపోని పరిస్థితికి చేరుకుంది అని చెప్పవచ్చు. ఇక తెలంగాణలో ఉన్న ఏకైక బలమైన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే అధికారం కోల్పోయి చిక్కుల్లో ఉంది అని చెప్పవచ్చు. దానికి తోడు కల్వకుంట్ల కవిత మరొక పార్టీ పెట్టడం కూడా అధినేత కేసిఆర్ కు తలనొప్పి అనే చెప్పాలి.

ఇక బిజెపి ప్రాంతీయ పార్టీల ఏరివేత కార్యక్రమంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యంత విజయవంతంగా తన ఆకర్షణ మిషన్ ప్రభావవంతంగా పనిచేసింది. మహారాష్ట్రలో ఆటో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేనను దెబ్బతీయడంలో బిజెపి పై చేయి సాధించింది. అలాగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత ఆ పార్టీని కూడా నిట్ట నిలువునా చీల్చింది. బీహార్ లో జేడీయు పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఇక మిగిలింది ఎవరైనా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పవచ్చు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మనుగడ పరంగా గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు అవసరం ఇంతకుముందు ఉన్నట్లుగా లేదు, దీంతో టిడిపి పై బిజెపి అధిష్టానం పట్టు బిగించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు లభిస్తున్నాయి.

టిడిపిని క్రమంగా బలహీనపరిచి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక దీర్ఘకాలిక రాజకీయ స్కెచ్ వేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును నేరుగా ఢీకొట్టకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని టిడిపి బలాన్ని తగ్గించే ప్రయత్నం బిజెపి చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే జనసేన ని వ్యవహార శైలి కూడా మార్పు రావడం చూడవచ్చు టిడిపికి పూర్తిగా అనుకూలంగా కాకుండా బిజెపి అభీష్టం మేరకే ఆయన అడుగులు వేస్తున్నారని చంద్రబాబు వద్ద సమాచారం ఉంది.

ఇక చంద్రబాబుకు అసలైన తలనొప్పి అమరావతి నిధుల రూపంలో మొదలుకానుంది ఎందుకంటే అమరావతి నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు చిరకాల కోరిక. అయితే కేంద్రం పై అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణలో మళ్లీ ఆటంకాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబును ఇరకటం పెట్టడం అమిత్ షా వ్యూహంగా చెబుతున్నారు ఎందుకంటే 2014లో సైతం ఇలాంటి రాజకీయ ఎత్తుగడలే వేసి చంద్రబాబును చిత్తు చేశారు.

అన్నింటికన్నా ముఖ్యమైనది అమరావతి తో పాటు పోలవరం తదితర కీలక ప్రాజెక్టులకు కేంద్ర నిధులు జాప్యం చేయడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి జరగటం లేదని అసంతృప్తిని టిడిపి ప్రభుత్వం పై మళ్లించడం అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పెంచడం ద్వారా ఏపీలో నిర్ణయాత్మకమైన కాపు ఓటు బ్యాంకును పూర్తిగా జనసేన బిజెపిల వైపు తిప్పుకొని టిడిపి ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్లాన్ చేస్తున్నట్లు ఈ మేరకు తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే భవిష్యత్తు రాజకీయాల్లో దృష్ట్యా టిడిపిలోని అసంతృప్తి నేతలు ద్వితీయ శ్రేణి నాయకులను జనసేన లేదా బిజెపిలోకి ఆకర్షించేలా తెర వెనుక పావులు కదులుతున్నాయి.

కూటమిలో ప్రభుత్వ పథకాలు నిర్ణయాల క్రెడిట్ చంద్రబాబుకు దక్కకుండా ఇదంతా కేంద్ర సహకారంతో పవన్ కళ్యాణ్ వల్లనే అంతా నడుస్తోందని ఇమేజ్ పరంగా పరోక్షంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. కిందిస్థాయిలో టిడిపి జనసేన కేడర్ మధ్య సఖ్యత లేకుండా చేయడం తద్వారా కూటమిలో అభద్రత భావాన్ని పెంచి టిడిపిని డిఫెన్స్ లో పడేయడం అనేది బిజెపి వ్యూహంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ప్రతిపక్ష వైసిపిని పూర్తిగా నామరూపాలు లేకుండా చేయకుండా ఆ పార్టీని ఒక భయంగా చూపిస్తూనే టిడిపిని తమ కంట్రోల్లో ఉంచుకుని రాజకీయ చదరంగం ఇప్పటికే అమిత్ షా ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *