Skip to content
జాతీయం వార్తలు

ఐక్యతగా ఉంటే బిజెపిని ఓడించడం సులువే

Prajapaksham 14 Jun 2026 0 నిమిషాల పఠనం జాతీయం
ఐక్యతగా ఉంటే బిజెపిని ఓడించడం సులువే

Defeating BJP Is Easy with United Opposition: Rahul Gandhi

  1. * బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేమి కాదు
  • *ఎన్ని గొడవలు ఉన్నా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి
  • *కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలున్నా చిరునవ్వుతో స్వీకరిస్తాం

(న్యూఢిల్లీలోని కాన్ క్లబ్ జూన్ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ చేసిన ప్రసంగం పూర్తి పాఠం)

నేడు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. వచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంవత్సరాల క్రితం. నా సన్నిహిత మిత్రుడు ఒకరితో నాకు ఒక వాదన జరిగింది. ‘నువ్వు చేస్తున్న పని అన్యాయం’ అయినదని నేను ఆయనతో చెప్పాను. దానికి ఆయన ‘ప్రపంచమే అన్యాయమైనది, దానికి అలవాటు పడాలి’ అని సమాధానం ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ గురించి ఈ రోజు ప్రస్తావించిన విషయాలకు సమాధానం చెప్పడం నా పని కాదు. శైవ సంప్రదాయంలో శివుడు గరళాన్ని మింగినట్లుగా వాటన్నింటినీ స్వీకరించడమే నా బాధ్యత. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నా, నా మీద లేదా కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఎలాంటి విమర్శలు ఉన్నా మేము వాటిని సంతోషంగా, మోముపై చిరునవ్వుతో అంగీకరిస్తాము.

మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మేము ప్రయత్నిస్తాము, ఎందుకంటే మీ పాత్ర కంటే మా పాత్ర మౌలికంగా భిన్నమైనది. నేను అహంకారంతో ఈ మాట అనడం లేదు. మీలో చాలామంది పేర్కొన్నట్లుగా ప్రేమ, ఆప్యాయతతో మీ అందరినీ ఏకం చేయడమే మా పాత్ర. 2004లో నా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుండి నేను కాంగ్రెస్ పార్టీ ఎంపిగా కొనసాగుతున్నాను. భారతదేశంలోని ఇతర పార్టీలన్నింటితో పోలిస్తే మా పార్టీ నిర్మాణం ప్రాథమికంగా భిన్నమైనది. ఈ విషయాన్ని నేను వినమ్రంగా చెబుతున్నాను. ఎందుకు అంటే, ఆధునిక భారతదేశం ఉనికిలోకి రాకముందే ఈ పార్టీ ఒక ప్రతిఘటన ఉద్యమంగా ప్రారంభమైంది. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా, భారత ప్రభుత్వ మౌలికవనరులు లేదా రక్షణ వ్యవస్థను ఉపయోగించుకుని దీని నిర్మాణం జరగలేదు. భారతీయులందరూ సమానం అనే భావన ను కాపాడే ఒక ప్రతిఘటన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ.

ప్రభుత్వ వ్యవస్థలను బిజెపి నియంత్రిస్తోంది
ఆర్ దృక్పథాన్ని మౌలికంగానే మేము వ్యతిరేకిస్తాము. బిజెపి లేదా ఆర్ చేతులు కలపడం లేదా రాజీపడటం కంటే, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రాణాలు వదలడానికే మేము ఇష్టపడతా ము. ఆర్ రాజీ పడడం సంభవించాలంటే మీరు మా తలలు నరకాల్సిందే. ‘మా తలలు నరికేయండి, కానీ మేము ఆర్ ముందు తలవంచబోము’ అని చెప్పే లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దేశంలో ఉన్నారని నాకు తెలుసు. ఈ సమూహంలో ఒక గందరగోళం ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఆ గందరగోళం ఏమిటంటే సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ వంటి పార్టీలు ఇప్పటివరకు ఉపయోగించిన రాజకీయ పద్ధతులే ఇంకా పనిచేస్తాయని విశ్వసిస్తున్నారు. భారత ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడు మాత్రమే అవి పనిచేశాయి. కానీ ఇప్పుడు అలాంటి సమాన అవకాశా లు ఉనికిలో లేవు. ప్రభుత్వ వ్యవస్థలను బిజెపి నియంత్రిస్తోంది. న్యాయ వ్యవస్థను బిజెపి నియంత్రిస్తోంది. అధికార యంత్రాంగాన్ని బిజెపి నియంత్రిస్తోంది. నిఘా సంస్థలను బిజెపి నియంత్రిస్తోంది. ఎన్నికల సంఘాన్ని కూడా బిజెపి నియంత్రిస్తోంది.

రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.
టిఎంసిలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. తాము ఎన్నిక ల్లో ఘనవిజయం సాధిస్తామని వారు బలంగా విశ్వసించారు. కానీ, ‘మీరు స్వప్నలోకంలో ఉన్నారు’ అని తరచుగా వారికి నేను చెప్పాను. ఏమి జరుగుతుందనేది నేను చూశాను. నేను గుజరాత్ చూశాను. మధ్యప్రదేశ్ చూశాను. ఛత్తీస్ చూసాను. హర్యానా, మహారాష్ట్రలలో కూడా నేను చూశాను. అయినప్పటికీ మీలో చాలా మంది అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ‘ప్రతిఘటన’ పార్టీ. అది పని చేసేందుకు భారత ప్రభుత్వ వ్యవస్థ తటస్థత అవసరం లేదు. వాస్తవానికి, భారత ప్రభుత్వంలో అనేక వ్యవస్థల గొంతు ఎంత నులిమితే, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ అంత ఉధృతంగా పోరాడుతుంది. మనమందరం కాంగ్రెస్ పార్టీ ఆదర్శాలను పంచుకుంటాము. ఆ ఆదర్శాలు ఏమిటి? సత్యం, అహింస, దయ.

ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటి? మీతో పోరాడటం అంటే నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. అకస్మాత్తుగా లేచి ‘నేను మీతో పోరాడుతాను’ అని అనేందుకు నేను పిచ్చివాడిని అయ్యి ఉండాలి. ఎందుకంటే మీరు మా మిత్రపక్షాలు, మా స్నేహితులు, మేము ప్రేమించే వ్యక్తులు. దయచేసి అర్థం చేసుకోండి. 2024 ఎన్నికల్లో మనం గెలిచాము. మనం 2024 ఎన్నికల్లో ఓడిపోలేదు. ఎందుకు వెళ్లిపోయారని మీరు నితీశ్ జీని అడగండి. ఆయన నా వల్లనో, కాంగ్రెస్ వల్లనో వెళ్ళిపోలేదు. సమీప భవిష్యత్తులో ఇప్పటివరకు పనిచేస్తున్న కొన్ని వ్యవస్థలు సైతం పనిచేయడం మానేస్తాయని మీతో నేను చెప్పగలను. ఎందుకంటే భారత ప్రభుత్వ వ్యవస్థపై బిజెపి, ఆర్ తమ పట్టును మరింత బిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల క్రితమే సరిగ్గా ఇలాంటి నిర్ణయాన్ని ఎదుర్కొంది. 1927కి ముందు మేము ఒక రాజకీయ సంస్థగా ఉండేవాళ్ళం. గాంధీజీ ‘మాకు స్వాతంత్య్రం కావాలి’ అని ప్రకటించిన రోజునే, మేము ఒక ప్రతిఘటన ఉద్యమంగా మారాము.

ప్రతి ఘటనా చర్య కావాలి ఇప్పుడు..
రాజకీయ పార్టీలు పనిచేయలేనప్పుడు, ఏది పనిచేస్తుంది? ప్రతిఘటన పనిచేస్తుంది. ప్రతిఘటన ఫలితాన్నిస్తుంది. మనం ఎక్కడ ప్రతిఘటించినా, అది అక్కడ పని చేస్తుంది. ఈ విషయాన్ని నేనే నా స్వంత కళ్ళ తో చూడగలిగాను. నేను ఈ దేశమంతటా 4,000 కిలోమీటర్లు నడిచాను. ప్రతిఘటన పనిచేస్తుంది. మీకు రాజకీయ నిర్మాణం అవసరం లేదు. మీకు అధికార యంత్రాంగం అవసరం లేదు. మీకు నిఘా సంస్థలు అక్కర్లేదు. మీకు కావాల్సింది ప్రతిఘటనా చర్య. దాని అర్థమేమిటంటే ‘నేను ప్రతిఘటిస్తాను. అన్యాయం జరిగేందుకు నేను అంగీకరించబోను.’ అంతే, అదే ముగింపు. అది ఒక స్ఫూర్తి. అది కేవలం ఒక సంస్థ కాదు. ఇదొక ఆలోచనా విధానం.

నిష్పక్షపాతమైన ఎన్నికలు లేకపోవడమే అసలు సమస్య ?
మనకు నచ్చినా నచ్చకపోయినా, మనం ఆ వైపుగానే వెళ్లాలి. మన ఆలోచనా విధానం మారాలి. ఇకపై మన ఆలోచ నా విధానం ఇలా ఉండాలి. మనం పరస్పరం పోరాడుకోకూడదు. మనపై దాడిచేసే అవకాశం మనం పత్రికలకు ఇవ్వకూడదు. మనం ప్రతిఘటించాలి. వచ్చే ఎన్నికల్లో గెలవడమే అసలైన సవాలు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ ఎన్నికలను ఇప్పటికే గెలిచాము. దయచేసి అర్థం చేసుకోండి. భారత ప్రజల్లో ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందంటే, రాబోయే ఎన్నికల ఫలితం ఇప్పటికే తేలిపోయినట్లే. సమస్య ఏమిటంటే, భారత ప్రభుత్వ వ్యవస్థలను ఆర్ తన ఆధీనంలోకి తీసుకోవడం. ఎన్నికలలో గెలిచేందుకు స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు లేకపోవడమే అసలు సమస్య.

ఎలాంటి విమర్శలు వచ్చినా నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను
అందుకే మనం ‘ప్రతిఘటన’ పద్ధతిని ఎంచుకోవాలి. సిబిఎస్ ఒక ప్రతిఘటన. నీట్ ఒక ప్రతిఘటన, ప్రతిఘటన గ్రేట్ నికోబార్ సైతం వెళ్తుంది. ‘భారత్ జోడో యాత్ర’ కూడా ప్రతిఘటనే. ఉదయాన్నే నిద్రలేచి ‘నేను ఎలా ప్రతిఘటించగలను?’ అని మీలో మీరు అనుకోవాలి. మీరు ప్రతిఘటించండి. అది కచ్చితంగా పనిచేస్తుంది. అది పని చేస్తుందని నేను మీకు గ్యారెంటీ ఇస్తారు. నా దృక్పథంలో ఏ వైపు నుంచైనా, ఎలాంటి విమర్శలు వచ్చినా నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే నాకు ఇది ఒక మతపరమైన విధి. ఇది ఇక ఆధ్యాత్మిక బాధ్యత. ఇది ఇకపై ఎంత మాత్రం రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. అందుకే నేను మీకు మాట ఇస్తున్నాను. ఈ సమూహా న్ని కలిసికట్టుగా ఉంచేందుకు, దీనిని విజయవంతం చేసేందుకు జరిగే కృషిలో ఎదురయ్యే ప్రతి ఒక్క అవమానాన్ని నేను భరిస్తాను.

దయచేసి మీ మనసుల్లోని సందేహాలను తొలగించుకోండి
ఇక ఎలా ముందుకు వెళ్లాలనేది అత్యంత స్పష్టంగా ఉంది. మనం ఒక నిర్దిష్టమైన ఆలోచనా ధోరణి నుండి బయటపడాలి. ఎన్నికల్లో తన గెలుపును దొంగలిస్తారని మమతా జీకి 100 శాతం కాకపోయినా, దాదాపు 90 శాతం నమ్మకం ఉంది. తన విజయాన్ని అపహరించారని ఉద్ధవ్ జీ 40 శాతం నమ్ముతున్నారు. నా సోదరుడు తేజస్వి జీకి కూడా 40 శాతం నమ్మకం ఉంది. జాగ్రత్తగా వినండి.. వంద శాతం ఎన్నికలు అపహరించబడుతున్నాయి. దయచేసి మీ మనసుల్లోని సందేహాలను తొలగించుకోండి. అలాగే, సోషల్ మీడియాలో బలమైన గుర్తింపును ఏర్పర్చుకునేందుకు ఏళ్ళకు ఏళ్ళ సమయం పడుతుందని, అది వారం రోజుల్లో సహజంగా జరిగిపోయే ప్రక్రియ కాదని దయ చేసి అర్థం చేసుకోండి.

బీజేపీ ప్రభుత్వం కోసం సోషల్ మీడియా పని చేస్తోంది
నాకు 10 మిలియన్ల యూట్యూబ్ ఫాలోయర్లు ఉన్నప్పటికీ, నా ఖాతా పూర్తిగా అణచివేయబడుతోంది. కాబట్టి, సోషల్ మీడియా నిష్పక్షపాతంగా ఉంటుందని, ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తుందని మీరు భావిస్తుంటే, మీరు వాస్తవానికి దూరంగా ఉన్నట్టే. మీడియా, సోషల్ మీడియా, న్యాయ వ్యవస్థ, అధికార యంత్రాంగం, నిఘా సంస్థలు ఇలా మొత్తం యంత్రాంగమంతా ఈ ప్రభుత్వాన్ని అధికారం లో ఉంచేందుకే పనిచేస్తోంది. కానీ, ఈ ప్రభుత్వం నిలబడదు, ఎందుకంటే ఇది మన ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసింది కాబట్టి. ఇది భారత ప్రజల భవిష్యత్తును నాశనం చేసింది. ఇరాన్ పరిణామాల తర్వాత ఇప్పుడు ఎదురయ్యే పరిస్థితి ఎవరి అదుపులోనూ ఉండదు. అది నియంత్రించలేనిది, అదే సమయంలో ప్రజలను సమీకరించేందుకు మనకు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే, మన మధ్య సమన్వయం లేదని, మనం కలిసికట్టుగా పనిచేయడం లేదని అనుకునే భావన నుంచి బైటపడంది. ఇవన్నీ బిజెపి ప్రచారం చేస్తున్న భావనలు. ఇది నిజం కాదు.

మన మధ్య కూడా పరస్పర గొడవలు ఉన్నా కలవాలి

నాకు 100 శాతం నమ్మకం ఉంది, ముఖ్యంగా డిఎంకె విషయంలో నేను మీకు ఇప్పుడే హామీ ఇవ్వగలను. ‘భారతదేశం’ అనే భావనను పరిరక్షించుకునే విషయానికి వస్తే, ప్రతి ఒక్క వ్యక్తి ఈ గదిలోనే ఉంటారు. మన మధ్య కూడా పరస్పర గొడవలు ఉన్నాయి. కానీ మీరు నన్ను కేరళ మాజీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళి, కౌగిలించుకోమని అడిగితే, నేను అలా చేయలేను, అలా చేయబోను కూడా. ఎందుకంటే ఆయనతో నాకు రాజకీయ పోరాటం జరుగుతోంది. కాబట్టి మనం పట్టువిడుపులతో ఉండాలి. ప్రతిపక్షం బలహీనంగా ఉందని నిరూపించేందుకు మనపై పూర్తిస్థాయి దాడి జరుగుతోందనే విషయాన్ని మనం గుర్తించాలి.

మనం కలిసికట్టుగా నిలబడి, ప్రతిఘటిస్తే బిజెపిని ఓడించటం చాలా సులభం
చివరగా, మన చర్చల్లో తరచుగా ఒక రకమైన నిస్పృహ ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. ‘అయ్యో దేవుడా, మనం ఎప్పటికైనా బిజెపిని ఓడించగలమా?’ అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే, మనం కలిసికట్టుగా నిలబడి, ప్రతిఘటిస్తే బిజెపిని ఓడించటం చాలా సులభం. గత ఎన్నికల్లో, బిజెపిని ఓడించగలమని నేను తప్ప ఈ గదిలో ఉన్నవారెవరూ నమ్మలేదు. కానీ, మనం వారిని ఓడిస్తామని ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ నమ్మడం ప్రారంభించాలి. ఆ విశ్వాసంతో మీరు ముందుకు సాగండి. రాష్ట్రం తర్వాత రాష్ట్రం, ఎన్నికల తర్వాత ఎన్నిక ల్లో, వారు అక్రమాలకు పాల్పడినా లేదా పాల్పడకపోయినా సరే, వారు కచ్చితంగా ఓడిపోతారని నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *