Bankipur Bypoll Result: బంకిపూర్ ఉప ఎన్నికలో బీజేపీకి బిగ్ టెన్సన్.. ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్..
Prashant Kishor
దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో, తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ‘జన్ సురాజ్’ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రారంభ ఓట్ల లెక్కింపులోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లడం పెద్ద సంచలనంగా మారింది.
Bankipur Bypoll Result: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన పలు రాష్ట్రాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పేపర్ లీక్‌లపై యువత, విద్యార్థులు జరిపిన భారీ నిరసనల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో.. ఈ ఫలితాలు దేశ ప్రజల.. ముఖ్యంగా యువ ఓటర్ల మనోభావాలను స్పష్టంగా ప్రతిబింబిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీహార్‌లోని బంకిపూర్ నియోజకవర్గంలో ఊహించని రీతిలో రాజకీయం వేడెక్కింది. దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో.. రాజకీయ వ్యూహకర్త నుంచి నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ తొలిసారి పోటీ చేసి ప్రారంభ ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నాయకుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఈ సీటులో, బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా, ఆర్‌జేడీ తరఫున రేఖా గుప్తా బరిలో నిలిచారు. బీజేపీ ఆఖరి నిమిషంలో అభ్యర్థిని మార్చాల్సి రావడం, ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు గుప్పించడంతో బంకిపూర్ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురికావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ బీజేపీ తరఫున అశుతోష్ తివారీ, కాంగ్రెస్ తరఫున కున్వర్ ఘనశ్యామ్ సింగ్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాకు ఈసారి టికెట్ దక్కకపోవడంపై ఆయన మద్దతుదారులలో నెలకొన్న అసంతృప్తిని అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తేలాల్సి ఉంది.
అటు గుజరాత్‌లోని మంజల్‌పూర్ స్థానంలోనూ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా పనిచేసిన యోగేష్ పటేల్ అకాల మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో, బీజేపీ తరఫున సతీష్ గోవిందభాయ్ పటేల్, కాంగ్రెస్ నేత భిఖాభాయ్ రబారీ పోటీపడుతున్నారు. వరుస విజయాలతో బీజేపీకి పట్టున్న ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తోంది.
- Teachers’ Day 2026 Speech Ideas: నేడు టీచర్స్ డే సందర్భంగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా..అయితే చక్కటి స్పీచ్ మీకోసం..
- Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…
- Happy Teachers Day 2026 Telugu Wishes: మీ బంధుమిత్రులు, స్నేహితులకు టీచర్స్ డే విషెస్ షేర్ చేయండి..
- Happy Teachers Day 2026 Wishes In Telugu: మీ టీచర్లు, స్నేహితులు, బంధు మిత్రులకు Messages, Quotes, Images రూపంలో Whatsapp Status, Facebook కోసం గ్రీటింగ్స్ మీకోసం..
- El Niño 2027 Alert: ప్రపంచానికి పెనుముప్పు తీసుకొస్తున్న చిన్న బాలుడు.. భారీ వర్షాలు, కరువు, తీవ్ర వేడి ముప్పు.. WMO తీవ్ర హెచ్చరిక