వైవిధ్యమైన ప్రేమకథ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’
Aakasamlo Oka Tara
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ‘చిట్టి చిట్టి చీమ’ పాట హృదయాన్ని హత్తుకునే మెలోడి.. భావోద్వేగంగా సినిమాలో ఏం చెప్పాలనుకున్నారో ఆ పాయింట్‌ను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. హీరోయిన్ కోణంలో పాడిన ఈ పాట, నక్షత్రాలను చేరాలనే ఒక మహిళ కలను, ఆమె పక్కన నిలబడి నిశ్శబ్దంగా అండగా నిలిచే వ్యక్తి ప్రేమను చూపిస్తుంది. శ్రీమణి రాసిన ఈ పాటను రమ్య బెహరా ఎంతో చక్కగా ఆలపించారు. చిట్టి చీమ చక్కెర మోసుకెళ్లడం, కొండపల్లి బొమ్మ కొండలు దాటడం, గాలికి ఎదురుగా మాత్రమే ఎగిరే గాలిపటం వంటి ఆకర్షణీయమైన ఉపమానాల ద్వారా ఈ పాట పట్టుదల, ఆశ, ప్రతి కల వెనుక ఉన్న నిశ్శబ్ద బలాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పావన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
- Harish Rao Farm House: అజీజ్‌నగర్ భూములపై కాంగ్రెస్ ఫీల్డ్ విజిట్.. కేటీఆర్, హరీశ్‌రావుపై చామల ప్రశ్నల వర్షం
- Harish Rao Farmhouse: అసైన్డ్ భూముల్లో ఫాం హౌస్ నిర్మించారు..అద్దంకి ఫైర్..హరీష్ రావు ఫాం హౌస్ భూముల్లో కాంగ్రెస్ నేతల ఫీల్డ్ విజిట్..
- Telangana Land Resurvey: భూముల రీ-సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. భూముల సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
- TIMS Hospital Theft: సనత్ నగర్ TIMS ఆసుపత్రిలో భారీ చోరీ.. 288 వైద్య పరికరాలు మాయం, సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు
- Singareni Workers Land Issue: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. భూముల సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం, 45 రోజుల్లో పరిష్కారం