ఫైనల్‌కు ఆర్సిబి
ధర్మశాల టైటిల్‌పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫయర్ గర్జించింది. ధర్మశాలలో ఏకపక్ష పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. రజత్ పటిదార్(93) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రికార్డు స్కోర్ కొట్టిన ఆర్సిబి.. జాకబ్ డఫ్ఫీ(39- రసిక్ దార్ సలాం(24- భువనేశ్వర్(28 విజృంభణతో గుజరాత్‌ను చిత్తు చేసి నాలుగోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఘోర ఓటమి చవిచూసిన శుభ్‌మన్ గిల్ సేన ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్ 2లో తలపడనుంది. ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. 19వ సీజన్ క్వాలిఫయర్ 254 పరుగులతో అత్యధిక స్కోర్ రికార్డు బద్ధలు కొట్టిన ఆర్సిబి.. గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. కనీసం పోరాడకుండానే మ్యాచ్‌ను బెంగళూరుకు అప్పగించేసింది. పేసర్లు జాకబ్ డఫ్ఫీ (39 రసిక్ దార్(24 హేజిల్‌వుడ్(39- వికెట్ల వేటతో చెలరేగగా ప్రత్యర్థిని 162 కే కట్టడి చేసిన రజత్ పటిదార్ బృందం 92 పరుగుల భారీ విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది. నిలిపిన 255 పరుగుల లక్ష్యాన్ని చూసి నీరుగారిపోయిన గుజరాత్ ఛేదనలో ఆది నుంచి తడబడింది. ఓపెనర్ సుదర్శన్(14) బ్యాట్‌ను వికెట్లపై పడేసుకొని హిట్‌వికెట్‌గా వెనుదిరగగా.. భువనేశ్వర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్(2)ను బౌల్డ్ చేసి గుజరాత్‌కు షాకిచ్చాడు. అనంతరం హేజిల్‌వుడ్ ఓవర్లో 4, 6, 4 బాదిన బట్లర్(29) బౌల్డయ్యాడు. రసిక్ దార్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిషాంత్ సింధు(5).. తర్వాతి బంతికే చేతికి చిక్కి హోల్డర్(0) చిక్కగా 51కే సగం వికెట్లు కోల్పోయింది గుజరాత్. ఓటమి ఖరారవ్వగా సుందర్ తేలిపోయాడు. సహకరించేవాళ్లు లేక ఒంటరైన ఇంప్యాక్ట్ సబ్ తెవాటియా(68) పరుగుల అంతరం తగ్గించే ప్రయత్నం చేశాడు. అర్ధ శతకంతో విసిగించిన తెవాటియా 19వ ఓవర్లో పటిదార్ క్యాచ్‌తో డగౌట్ చేరాడు. సిరాజ్ చివరి వికెట్‌గా ఔటవ్వగా ఆర్సిబి 92 పరుగులతో విజయం సాధించింది.
చితక్కొట్టిన పటిదార్
క్వాలిఫయర్ 1లో కెప్టెన్ రజత్ పటిదార్(93 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు స్కోర్ కొట్టింది. విరాట్ కోహ్లీ(43), పడిక్కల్(30)లు అదిరే ఆరంభమివ్వగా.. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి ఆర్సిబి 76 పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్ రజత్ పటిదార్(93 నాటౌట్) మెరుపుఇన్నింగ్స్తో గుజరాత్ బౌలర్లను భయపెట్టాడు. ఖేజ్రోలియా వేసిన 15వ ఓవర్లో రెండు నో బాల్స్, వైడ్ నాలుగు ఫోర్లు, సిక్సర్ కలిపి 28 రన్స్ వచ్చాయి. వికెట్‌కు 95 రన్స్ జోడించిన కృనాల్(43)ను రబడ ఔట్ చేయగా గుజరాత్ ఊపిరిపీల్చుకుంది. కానీ, పటిదార్ రెండు సిక్సర్లతో స్కోర్ రెండొందలు దాటించాడు. అంతేనా.. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదేశాడు. గుజరాత్ చెత్త ఫీల్డింగ్ కూడా కలిసి రావడంతో ఆర్సీబీ నాకౌట్లో అత్యధిక స్కోర్‌తో చరిత్ర సృష్టించింది. 2023లో ముంబై ఇండియన్స్‌పై 233/3తో గుజరాత్ సాధించిన రికార్డును బెంగళూరు బద్ధలు కొట్టింది.