Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టిడిపి ట్రాప్ లో పడుతున్న జనసేన.. ఇక 2029 ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోందా..?

Prajapaksham 11 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
టిడిపి ట్రాప్ లో పడుతున్న జనసేన.. ఇక 2029 ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోందా..?

టిడిపి ట్రాప్ లో పడుతున్న జనసేన.. ఇక 2029 ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోందా..? (image: x,com)

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నెమ్మదిగా అసలైన రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి జనసేన ఎదుగుదల అనేది టిడిపికి ఎప్పటికైనా ఎదురు దెబ్బ అవుతుందని అధినేత చంద్రబాబు నాయుడుకు ఎప్పటి నుంచో తెలుసు. మిత్ర ధర్మంతో జనసేన కాళ్లు చేతులు కట్టేసినప్పటికీ కూడా ఎప్పటికైనా జనసేన తనకు ఎదురవుతుందని ఓటు బ్యాంకు ను దెబ్బతీస్తుందని తెలుగుదేశం వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. జనసేన ను తమ పక్షం వైపే ఉంచి దెబ్బతీయడం ఎలా అని టిడిపి అధినాయకత్వం ఆ దిశగా అడుగులు ఎలా వేయాలని పెద్ద ప్లాన్ నడుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తాజా పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యూట్యూబర్ రావణ్ అరెస్టు అనంతరం అసలైన రాజకీయాలు బయటకు వచ్చాయి. అటు సోషల్ మీడియా వేదికగా జనసేన పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా టిడిపి వర్గాలు మాత్రం ఈ ఇష్యూ కు చాలా దూరంగా ఉంటున్నాయి. అయితే టిడిపి ఎకో సిస్టంలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం తూతూ మంత్రంగా ఈ విషయంలో కొద్దిగా ఫోకస్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై జనసేన వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. తమను బ్యాడ్ చేసేందుకు టిడిపి ఎకో సిస్టం పనిచేస్తుందని చర్చ కూడా ఇప్పుడే మొదలైంది.

అటు తెలుగుదేశం పార్టీ ఎకో సిస్టం చేస్తున్న ట్రాప్ లో ఇప్పటికే జనసేన చిక్కుకొని ఉందని ఆ పార్టీ వర్గాల్లో సైతం చర్చ నడుస్తోంది. ముఖ్యంగా యూట్యూబర్ రావణ విషయంలో జరుగుతున్న తతంగం గమనిస్తూ ఉంటే, దీని వెనుక ఉన్న కుల రాజకీయాలు అర్థం చేసుకోవచ్చు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మొదటి నుంచి కూడా జనసేన పైన ఎక్కువగా టార్గెట్ పెట్టి ఉన్నారు. నిత్యం పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ అనేక వీడియోలు చేయడం చూడవచ్చు. అలాగే గతంలో తెలుగుదేశం ముఖ్యంగా నారా లోకేష్ విషయంలో రావణ్ కు సాఫ్ట్ కార్నర్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తెలుగుదేశం ఎకో సిస్టం నుంచే వచ్చిన మరొక రాజకీయ కొత్త శక్తి మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సైతం ఈ మధ్య రావణ్ అరెస్టును ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం చూడవచ్చు. అదే సమయంలో ప్రతిపక్ష వైసిపి నేతలు మాత్రం బాహాటంగానే వచ్చి రావడకు మాకు ఎలాంటి సంబంధాలు లేవని కుండబద్దలు కొట్టేశారు.

మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పటికే రెండుసార్లు రావణ్ టిడిపి ఎకో సిస్టం మనిషి అని బయట పెడుతున్నారు. ముఖ్యంగా జనసేనకు ఈ విషయంలో డ్యామేజీ జరగాలని టిడిపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి బలంగా ఉండే గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన బలంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాలను జనసేన నుంచి దూరం చేయాలని ఈ యూట్యూబర్ రావణ అంశం తోడ్పడుతుందని టిడిపి అధిక నాయకత్వం భావిస్తోంది అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ ముసుగులో గుద్దులాట 2029 వరకు సాగే అవకాశం ఉందని, ఎన్నికలకు ముందే జనసేన ను వీలైనంత డ్యామేజీ చేసి ఆ తర్వాత తక్కువ సీట్లతో మళ్లీ కూటమిలో పార్ట్నర్ గా మిగిల్చి కోవాలని టిడిపి ట్రాప్ సిద్ధం చేసిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తానికి అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బిజెపితో మమేకం అవుతూ టిడిపిని ఒత్తిడి తెచ్చే పనిలో ఉన్నారని జనసేన వర్గాలు సైతం ధీమాగా చెబుతున్నాయి. మొత్తానికి 2029 ఎన్నికలకు ఇప్పటినుంచే జోరుగా భూమిక సిద్ధం అవుతుంది. ఇక రాజకీయ రణరంగంలో ఎవరి ఎత్తులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.