Telangana: వరంగల్ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమ పేరు.. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కొమురం భీం పేర్లు ఖరారు చేసిన ప్రభుత్వం
Revanth Reddy meeting
Telangana: తెలంగాణలోని వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు పేర్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చారిత్రక వైభవాన్ని, వీరుల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా మామునూరు ఎయిర్‌పోర్టుకు కాకతీయ రాణి రుద్రమదేవి పేరును, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివాసీ అమరవీరుడు కొమురం భీమ్ పేరును పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను రాబోయే మంత్రివర్గ (కేబినెట్) సమావేశం ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ పేర్లపై విస్తృతంగా చర్చించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాలకు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టిన తరహాలోనే, తెలంగాణ ప్రాచీన సంస్కృతి, చరిత్ర , విప్లవ పోరాటాలను ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే, ఈ పేర్లను ఆమోదించాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారిక లేఖను పంపనున్నారు. కేంద్రం నుండి అనుమతి లభించిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. కాగా, మామునూరు ఎయిర్‌పోర్టుకు సమ్మక్క-సారలమ్మ పేరును కూడా పరిశీలిస్తున్నారని, కేబినెట్ భేటీలో దీనిపై పూర్తి స్పష్టత రానుందని సమాచారం.
డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి:
ఇదే సమీక్షా సమావేశంలో అధికారులు సమర్పించిన విమానాశ్రయాల ఆకృతులపై (డిజైన్లు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారులు చూపించిన మోడళ్లను పరిశీలించిన సీఎం, “ఇవి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రామాణిక డిజైన్లా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించిన సాధారణ డిజైన్లా?” అని ప్రశ్నించినట్లు సమాచారం. విమానాశ్రయాల నిర్మాణాలు కేవలం సాధారణంగా కాకుండా, తెలంగాణ సంస్కృతి, విశిష్టమైన చరిత్ర ఉట్టిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రస్తుతం కొత్త మోడల్ డిజైన్లను సిద్ధం చేసే పనిలో పడ్డారు. త్వరలోనే వీటికి సంబంధించిన తుది ఆకృతులను మళ్లీ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించనున్నారు.
- Danam Nagender: మళ్లీ ఖైరతాబాద్ నుంచే పోటీ చేస్తా..ఏ పార్టీ నుంచి అనేది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే వెల్లడిస్తా.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
- Super El Niño: ప్రపంచానికి పెను ముప్పు.. ఫిబ్రవరి నాటికి 4.51 లక్షల మరణాలు.. క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ హెచ్చరిక..
- Ganesh Immersion Duty: వీడియో ఇదిగో.. గణేశ్ నిమజ్జనం విధులకు వచ్చి ఎస్ఐ మృత్యువాత.. బైక్ ఢీకొని ఎస్ఐ వెంకన్న మృతి
- Khairatabad Bypoll: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక..
- Telangana Rains: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నేడు, రేపు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ నగర వాసులకు ఐఎండీ కీలక సూచన..