Skip to content
జాతీయం › వార్తలు

Rahul Gandhi Attacks PM Modi: ప్రధాని మోదీ బస్తర్ పర్యటనపై రాహుల్ గాంధీ విమర్శలు.. బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్..

jagan 09 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Rahul Gandhi Attacks PM Modi: ప్రధాని మోదీ బస్తర్ పర్యటనపై రాహుల్ గాంధీ విమర్శలు.. బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్..

Rahul Gandhi

Rahul Gandhi Attacks PM Modi: దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన బస్తర్ పర్యటనను లక్ష్యంగా చేసుకుంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన మరోసారి బహిరంగ చర్చకు సవాలు విసిరారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, ప్రధాని చెబుతున్న అబద్ధాలను దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు సైతం నమ్మరని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను ప్రధానమంత్రి ‘నక్సలైట్లు’ అని సంబోధించారని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో అసలైన దేశద్రోహి ఎవరో తేల్చుకోవడానికి ప్రధానమంత్రితో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దీనిపై ప్రధాని స్పందించి చర్చకు రావలసిందిగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.