Skip to content
తెలంగాణ › వార్తలు

Hyderabad Air Quality: హైదరాబాద్‌ను కమ్మేసిన కాలుష్యం.. దీపావళి తర్వాత పెరిగిన వాయు కాలుష్యం.. పడిపోయిన గాలి నాణ్యత..

jagan 09 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Air Quality: హైదరాబాద్‌ను కమ్మేసిన కాలుష్యం.. దీపావళి తర్వాత పెరిగిన వాయు కాలుష్యం.. పడిపోయిన గాలి నాణ్యత..

Hyderabad Air Quality

Hyderabad Air Quality: దీపావళి పండుగ సందర్భంగా భాగ్యనగరంలో ప్రజలు ఆదివారం రాత్రి అత్యధిక స్థాయిలో బాణాసంచా కాల్చడంతో హైదరాబాద్ గాలి నాణ్యత ఊహించని రీతిలో పడిపోయింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (AQI) అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ జోన్’లోకి చేరింది. పటాకుల ధూళితో పాటు శీతాకాలపు శీతల గాలులు తోడవడంతో దట్టమైన పొగమంచు (Smog) నగరాన్ని ఆవరించింది.

వివిధ ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత: నగరం నడిబొడ్డుతో పాటు ఐటీ కారిడార్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో కాలుష్యం రికార్డు స్థాయికి చేరింది. రాత్రి వేళల్లో కొన్ని పర్యవేక్షణ కేంద్రాలలో నమోదైన వివరాల ప్రకారం:

రవి కాలనీ (మస్జిద్ బండ సమీపంలో): ఏక్యూఐ అత్యధికంగా 995 నమోదు కాగా, ప్రమాదకరమైన PM 2.5 కణాల సాంద్రత 392 µg/m³కి చేరింది.
ప్రకాష్ నగర్: ఏక్యూఐ సూచీ 828 పాయింట్లు దాటి ప్రమాదకర స్థాయికి పడిపోయింది.
గాజులరామారం, ప్రగతి నగర్, KPHB ఫేజ్-1: ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 480 నుంచి 487 పాయింట్ల మధ్యన నమోదై ‘సీవియర్’ కేటగిరీకి చేరింది.
బాచుపల్లి, షేరిలింగంపల్లి, గచ్చిబౌలి: నిరంతరం పటాకులు పేల్చడం వల్ల ఈ శివారు ప్రాంతాల్లో ఏక్యూఐ 460 దాటి నమోదు రికార్డైంది.

మండే ఉదయానికి నగర సగటు గాలి నాణ్యత 178 ఏక్యూఐ వద్ద కొనసాగుతుండగా, క్షీణించిన గాలి నాణ్యత ప్రభావం ఇంకా కొనసాగుతోంది.

బాణాసంచా పేలుళ్ల తీవ్రత వల్ల కాలుష్యంతో పాటు గాయాల పాలైన ఉదంతాలు నమోదయ్యాయి. మెహదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రికి సోమవారం ఉదయానికి 48 మంది కంటి గాయాలతో రాగా, అందులో 10 మందిని వార్డుల్లో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. అలాగే సీతాఫల్‌మండి, చిలకలగూడ, కాటేదాన్ ప్రాంతాల్లోని నిల్వ గోదాములలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి రసాయనాలు అధికం కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, చిన్న పిల్లలు , వయోవృద్ధులు కొద్దిరోజుల పాటు ఉదయాన్నే నడకలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని, అత్యవసరంగా బయటకు వెళ్లే సమయంలో ఎన్-95 (N95) మాస్కులు వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం: ‘పూర్’ కేటగిరీకి పడిపోయిన హైదరాబాద్ గాలి నాణ్యత

చలికాలం ప్రారంభం కావడంతో పాటు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెరిగిన వాహన రాకపోకలు, పారిశ్రామిక ఉద్గారాల కారణంగా భాగ్యనగరంలో వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతోంది. నగరంలో వాయు నాణ్యత సూచీ (AQI) చాలా ప్రాంతాల్లో ‘పూర్’ (క్షీణించిన) కేటగిరీకి పడిపోవడంతో నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా నివేదికల ప్రకారం హైదరాబాద్‌లోని సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 120 నుండి 140 మధ్య నమోదవుతోంది. గాలిలో ఊపిరితిత్తులలోకి చొరబడే అత్యంత ప్రమాదకరమైన PM 2.5 , PM 10 కణాల సాంద్రత ప్రమాణాల కంటే ఎక్కువగా నమోదుకావడమే ఈ పరిస్థితికి కారణం. సాధారణంగా శీతాకాలంలో ఈశాన్య దిశ నుంచి పొడి గాలులు వీయడం, ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల గాలిలో కాలుష్య కణాలు కింది పొరల్లోనే చిక్కుకుపోయి పొగమంచుతో (Smog) కూడిన కాలుష్యం ఏర్పడుతోంది.

నగరంలో పెరుగుతున్న కాలుష్యానికి బహుళ కారణాలు ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వ్యక్తిగత వాహనాల రద్దీ , నిత్యం ట్రాఫిక్ జామ్‌ల వల్ల వెలువడే దట్టమైన పొగ ప్రధాన కారకంగా నిలుస్తోంది. దీనికి తోడు నగర శివార్లలోని నిర్మాణ పనులు, దమ్ము ధూళి , శీతాకాలంలో రాత్రి వేళల్లో పెరిగే చలిగాలుల ప్రభావం వల్ల గాలి కదలికలు మందగించి కాలుష్యం ఒక్కసారిగా పేరుకుపోతోంది. జియాగూడ, బహదూర్ పురా, సనత్‌నగర్, పంజాగుట్ట వంటి రద్దీ ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు మరింత ఎక్కువగా నమోదు కావడం గమనార్హం.

గాలి నాణ్యత తగ్గిపోవడంతో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, అలర్జీలతో బాధపడేవారు, ముఖ్యంగా చిన్న పిల్లలు , వయోవృద్ధులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగమంచు దట్టంగా ఉన్న ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేవారు మాస్కులు ధరించాలని, ఉదయం వేళ ఓపెన్ ఏరియాల్లో వాకింగ్ లేదా వ్యాయామాలు చేసేవారు కొద్దిరోజులు సమయాన్ని మార్చుకోవడం మేలని సూచిస్తున్నారు. అధికారులు కూడా నిర్మాణ రంగ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు రోడ్ల శుభ్రతపై దృష్టి సారించాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు.