Telangana Land Irregularities: తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు.. జీవో 134 జారీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్..
టీ క్యూర్ బిల్లు–2026కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
Telangana Land Irregularities: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో చోటుచేసుకున్న తీవ్రస్థాయి భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 16న శాసనసభలో రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22-ఏ పై జరిగిన స్వల్పకాలిక చర్చ ఆధారంగా, ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 134 (G.O.Ms.No. 134) ద్వారా ఈ విచారణ కమిటీని నియమించింది. చట్టాలు, జీవోల ఉల్లంఘనలను గుర్తించి, బాధ్యులపై చర్యలు రికమండ్ చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ స్పష్టం చేశారు.
కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ ఎ. శ్రీదేవసేన (IAS) చైర్‌పర్సన్‌గా ఈ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్లు & స్టాంపుల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు (IAS) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (IAS) తో పాటు, సంబంధిత గ్రామాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా రికార్డులు, సమాచారాన్ని కోరే పూర్తి అధికారాలను కల్పించారు.
కమిటీ విచారణాంశాలు (TOR):
జివో అనుబంధంలో పేర్కొన్న గ్రామాలు , భూముల్లో జరిగిన చట్టవిరుద్ధమైన కేటాయింపులను కమిటీ పరిశీలిస్తుంది. ప్రభుత్వ భూములు, సీలింగ్ మిగులు భూములు, అసైన్డ్, జాగీర్, భూదాన్, ఇనాం, అటవీ భూములతో పాటు జలాశయాల ఆక్రమణలు, భూసేకరణ , పునరావాస పరిహారాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తుంది.
విచారణ పరిధిలోకి వచ్చే ప్రధాన అంశాలు & ప్రముఖుల భూములు:
ఈ విచారణ కమిటీ పరిధిలోకి ముఖ్య నేతలు , ప్రముఖులకు చెందిన పలు ప్రతిష్టాత్మక భూ వివాదాలు రానున్నాయి.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, మార్కూక్, వెంకటాపూర్ గ్రామాల్లో పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబ సభ్యుల భూములు, రంగనాయక సాగర్ తీరంలోని రామాంచ గ్రామంలో మాజీ మంత్రి తానీరు హరీష్ రావు కుటుంబ సభ్యుల భూముల కొనుగోళ్లు విచారణ పరిధిలో ఉన్నాయి. అలాగే మల్లన్న సాగర్ భూసేకరణ అక్రమాలు (ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహాడ్ తదితర గ్రామాలు), కొండపాక మండలం వెలికట్టలో ఎమ్. హనుమంతరావు అసైన్డ్ భూముల కొనుగోళ్లపై తనిఖీలు జరగనున్నాయి.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో కేటీఆర్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన భూములు, షాబాద్‌లోని మద్దూర్ గ్రామంలో మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి భూములు, మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో పి. రోహిత్ రెడ్డి అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలు, శంషాబాద్ బహదూర్‌గూడలో గంగుల కమలాకర్ ప్రభుత్వ భూముల కొనుగోలు ఆరోపణలపై కమిటీ దృష్టి సారించనుంది.
అంతేకాకుండా, వట్టినగులపల్లిలోని భూదాన్ భూములు , శంకరా హిల్స్ ప్రాంతంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కొనుగోళ్లపై విచారణ జరగనుంది. కందుకూర్ తిమ్మాపూర్ భూదాన్ భూములు, సికింద్రాబాద్ జీరా ల్యాండ్స్‌లో మాజీ ఎమ్మెల్సీ ఎల్విన్ స్టీఫెన్సన్ లీజు క్రమబద్ధీకరణ అంశాలు ఇందులో ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా గుండెడ్ గ్రామంలో ధరణి పోర్టల్ దుర్వినియోగం ఆరోపణలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దాపూర్, లక్ష్మీపూర్ తదితర గ్రామాల్లో అసైన్డ్ భూముల కొనుగోలు , ప్రభుత్వ భూ కేటాయింపులపై విచారించనున్నారు. అలాగే మిడ్ మానేరు జలాశయం భూసేకరణలో జోగినపల్లి రవీందర్ రావు దంపతుల పరిహారం , ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అక్రమాల ఆరోపణలను కూడా కమిటీ సమగ్రంగా విచారించి రికమండేషన్లతో విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
- Danam Nagender: మళ్లీ ఖైరతాబాద్ నుంచే పోటీ చేస్తా..ఏ పార్టీ నుంచి అనేది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే వెల్లడిస్తా.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
- Super El Niño: ప్రపంచానికి పెను ముప్పు.. ఫిబ్రవరి నాటికి 4.51 లక్షల మరణాలు.. క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ హెచ్చరిక..
- Ganesh Immersion Duty: వీడియో ఇదిగో.. గణేశ్ నిమజ్జనం విధులకు వచ్చి ఎస్ఐ మృత్యువాత.. బైక్ ఢీకొని ఎస్ఐ వెంకన్న మృతి
- Khairatabad Bypoll: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక..
- Telangana Rains: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నేడు, రేపు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ నగర వాసులకు ఐఎండీ కీలక సూచన..