Hyderabad Rain Alert: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త..రాత్రికి వాన కుమ్ముడే కుమ్ముడు.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక..
Sajjanar
Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా నగరవాసులకు పలు కీలక సూచనలు చేశారు:
అనవసర ప్రయాణాలు వద్దు: అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.
త్వరగా ఇళ్లకు చేరుకోవాలి: ప్రస్తుతం పనుల నిమిత్తం బయట ఉన్నవారు వర్షం తీవ్రరూపం దాల్చకముందే తమ పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణం వద్దు: రహదారులపై నీరు నిలిచిన చోట్ల, వర్షపు నీటితో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణించడం అస్సలు సురక్షితం కాదని హెచ్చరించారు.
వాహనదారులకు హెచ్చరిక: రహదారులపై ప్రయాణించే వాహనదారులు వేగం తగ్గించి, అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో అందరూ అప్రమత్తంగా ఉంటూ, సురక్షిత ప్రాంతాల్లో లేదా ఇళ్లలోనే ఉండాలని సజ్జనార్ కోరారు.
- వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా
- Telangana Political Row: కేటీఆర్,హరీష్ రావు విడుదల.. రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు..
- Telangana Assembly Session: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు!
- Saudi Arabia’s Water Miracle: నదులు లేకపోయినా కోట్ల మందికి మంచి నీరు ఎలా.. సౌదీ అరేబియా వాటర్ సప్లై వెనుక అసలు రహస్యం..
- Eiffel Tower: ఈఫిల్ టవర్ వద్ద లింగ వివక్ష వివాదం.. మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించడంపై సిబ్బంది ఆగ్రహం..