Skip to content
జాతీయం › వార్తలు

వ్యవసాయానికి నిధుల కొరత

Prajapaksham 16 Oct 2026 0 నిమిషాల పఠనం జాతీయం
వ్యవసాయానికి నిధుల కొరత

Climate change

భారతదేశంలో వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా పడుతోంది. వేసవి ఎండలు కొన్ని ప్రాంతాల్లో తగ్గినప్పటికీ, అధిక ప్రాంతాల్లో ఇంకా వేసవిని తలపించే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ కారణంగా పండ్ల పెరుగుదల మందగించడం, కూరగాయల విత్తనా లు మొలకెత్తకపోవడం, చీడపీడలు పెరగడం వంటి సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. వాతావరణ హెచ్చరికలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, సాంకేతిక సహాయం క్షేత్రస్థాయిలో సరిపోవడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫలసాయం దాదాపు సగం తగ్గిందని రైతులు వాపోతున్నారు. అరటితోపాటు, బెండకాయ, ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ వంటి కూరగాయల విత్తనాలు సరిగా మొలకెత్తడం లేదు. చీడపీడల దాడులు కూడా పంట నష్టాన్ని పెంచుతున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఒ) నిపుణుల ప్రకా రం, వాతావరణ పరిణామాలను ముందుగానే అంచనా వేసే సామర్థ్యం పెరిగింది. అయితే ఆ సమాచారాన్ని ఉపయోగించి రైతులు సకాలంలో విత్తనాలు మార్చడం, నీటిని సమర్థంగా వినియోగించడం, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం వంటి చర్యలు తీసుకోవడానికి తగిన సదుపాయా లు లేవు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం గురించి కూడా నిపుణులు హెచ్చరించారు. ఐక్యరాజ్యసమి తి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి) నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2023 లో వాతావరణ మార్పులను ఎదుర్కొనే అనుకూలన చర్యల కోసం కేవలం 26 బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ నిధులు అందాయి. అయితే, 2030 నాటికి భారతదేశానికి అనుకూలన చర్యల కోసం రూ.56.68 లక్షల కోట్ల వ్యయం అవసరమని 2023లో సమర్పించిన నివేదికలో అంచనా వేశా రు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి, వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడానికి ఖర్చు చేసే నిధులను ‘అనుకూలన నిధులు’ అంటారు. డబ్ల్యుఆర్‌ఐ నిపుణుల అభిప్రాయాన్ని అనుసరించి, పప్పుధాన్యాలు, నూనెగింజ లు వంటి తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించడం అవసరం.
ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ వంటి వర్షాధార ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి పంటల ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తున్నారు. పంటల బీమా, గ్రామీణ రుణాలు, మెరుగైన వాతావరణ అంచనాలు, నీటి నిర్వహణ వంటి చర్యలు చిన్న, సన్నకారు రైతుల కు కీలకం. కాగా,నవంబర్‌ 9 నుంచి 20వ తేదీ వరకు అంటాల్యా (తుర్కియే/టర్కీ)లో జరగనున్న ‘కాప్‌ 31’ అంతర్జాతీయ వాతావరణ సదస్సులో ప్రస్తుత ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునే వ్యవసాయం, ఆహార భద్రత, రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. అంతర్జాతీయంగా మరిన్ని గ్రాంట్లు, తక్కువ వడ్డీ రుణా లు అందించడం అవసరం.