Badlav Zaroori Hai Rally Photos: నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ గర్జన.. బద్లావ్ జరూరీ బహిరంగ సభ సక్సెస్.. ఫోటోలివిగో..
Badlav Zaroori Hai Rally Photos
Badlav Zaroori Hai Rally: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) సమరశంఖం పూరించింది. న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన భారీ “బద్లావ్ జరూరీ” బహిరంగ సభకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు, శ్రామికులు, యువత తరలివచ్చారు. ఈ బహిరంగ సభను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించి ప్రసంగించారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సంక్షోభాల నుంచి విముక్తి కలగాలంటే కేంద్రంలో అధికార మార్పిడి అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.
పదేళ్ల మోదీ పాలనలో దేశం ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయిందని రాజా విమర్శించారు. విదేశాంగ విధానంలో అమెరికా, ఇజ్రాయెల్ లబ్ధి కోసం భారత్ పాత మిత్రదేశాల బంధాలను దెబ్బతీసుకుంటోందని, రష్యా నుంచి చమురు కొనవద్దని అమెరికా ఆదేశించడం భారత సార్వభౌమాధికారంపై జరుగుతున్న దాడి అని మండిపడ్డారు.




