Independence Day in Telugu : 72 గంటల పోరాటం.. చైనా సైన్యాన్ని గడగడలాడించిన ఇద్దరు గిరిజన యువతులు, ఓ సైనికుడి వీరగాథ గురించి ఎవరికైనా తెలుసా..
Sela and Nura
Independence Day in Telugu : 1962 భారత్-చైనా యుద్ధం నాటి చారిత్రాత్మక ఘట్టాలు నేటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి రగిలిస్తూనే ఉంటాయి. సైనిక శిక్షణ లేకపోయినా, కేవలం దేశభక్తితో ఒక భారతీయ సైనికుడికి అండగా నిలిచి.. చైనా దళాలను 72 గంటల పాటు నిలువరించిన ఇద్దరు వీరనారీమణులు సెలా (Sela), నూరా (Nura)ల త్యాగం భారత సాయుధ బలగాల చరిత్రలోనే అత్యంత అరుదైన కథనంగా నిలిచింది.
1962 యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దుల్లో చైనా సైన్యం వేలాదిగా విరుచుకుపడుతున్న వేళ.. 4వ గర్హ్వాల్ రైఫిల్స్‌కు చెందిన జస్వంత్ సింగ్ రావత్ అనే భారత సైనికుడు వెనక్కి తగ్గకుండా శత్రువులను ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో కొండల్లో నివసించే ‘మోన్పా’ గిరిజన తెగకు చెందిన అక్కాచెల్లెళ్లు సెలా, నూరా ఆయనకు సహాయంగా నిలిచారు.
జస్వంత్ సింగ్ వ్యూహం ప్రకారం.. కొండపై ఉన్న వేర్వేరు బంకర్లలో ఆయుధాలను అమర్చారు. సెలా, నూరాలు ప్రాణాలను పణంగా పెట్టి ఒక బంకర్ నుంచి మరొక బంకర్‌కు మందుగుండు సామాగ్రి, ఆహారం అందించేవారు. జస్వంత్ సింగ్ నిరంతరం బంకర్లు మారుస్తూ కాల్పులు జరపడంతో, అక్కడ కొండపై భారీ సంఖ్యలో భారత సైన్యం ఉందనే భ్రమలో చైనా దళాలు ఉండిపోయాయి.

ఈ ముగ్గురు కలిసి ఏకంగా 300 మందికి పైగా చైనా సైనికులను మట్టుబెట్టారు. 3 రోజుల పాటు చైనా ఆర్మీని అంగుళం కూడా ముందుకు కదలకుండా నిలువరించారు. అయితే మూడో రోజు అక్కడ ఉన్నది ఒక్కడే సైనికుడని చైనా దళాలకు తెలియడంతో.. బంకర్లపై ఒకేసారి బాంబుల వర్షం కురిపించారు. ఈ విపరీతమైన దాడిలో సెలా అక్కడికక్కడే వీరమరణం పొందగా.. నూరాను చైనిజ్ సైనికులు దారుణంగా హత్య చేశారు. ఇక చైనా దళాలకు చిక్కకూడదని భావించి జస్వంత్ సింగ్ కూడా చివరి తుపాకీ గుండుతో అమరుడయ్యాడు.
ఈ అమరవీరుల త్యాగానికి గుర్తుగా అరుణాచల్ ప్రదేశ్‌లో కొండ మార్గానికి సెలా పాస్” (Sela Pass) అని, సమీపంలోని జలపాతానికి నూరానాంగ్ జలపాతం (Nuranang Falls) అని నామకరణం చేశారు. జస్వంత్ సింగ్ జ్ఞాపకార్థం అక్కడ జస్వంత్‌గఢ్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. భారతదేశ సరిహద్దులను కాపాడటంలో ఈ గిరిజన సోదరీమణులు చూపిన ధైర్యం చిరస్మరణీయం.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..