Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

ప్రజాస్వామ్య సౌధానికి నిశ్శబ్ద ‘వారధి’

Prajapaksham 05 Oct 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
ప్రజాస్వామ్య సౌధానికి నిశ్శబ్ద ‘వారధి’

A silent ‘bridge’ to the edifice of democracy.

– ఎన్‌ విజయ రాఘవ రెడ్డి

చరిత్ర కేవలం అధికార పీఠాలపై వెలిగిన రాజనీతిజ్ఞుల విజయగాథ మాత్రమే కాదు, పీఠాల వెనుక నిలిచి ఉద్యమ జ్వాలలను రగిలించిన, వ్యవస్థ పునాదులను నిశ్శబ్దంగా నిర్మించిన నిస్వార్థ కర్మయోగుల త్యాగఫలం. సరిగ్గా ఇటువంటి నిబద్ధత కలిగిన మహనీయుడు కీ॥శే॥ శ్రీపూర్ణబోధ నరసింహ మూర్తి (పి.ఎన్‌. మూర్తి). తన జీవితాన్నే జాతి విముక్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు అంకితం చేసిన ఆయన శతజయంతి (ఆగస్టు 31, 2026) సందర్భాన్ని పురస్కరించుకుని వెలువడిన అపురూప చారిత్రక గ్రంథం ‘వారధి’. పూర్ణబోధ శ్రీకాంత్‌ తన తండ్రి ఆశయాలను అక్షరబద్ధం చేయగా, శాసనసభ అంతర్గత కార్యకలాపాలపై లోతైన అనుభవం కలిగిన శ్రీపాద శ్రీనివాసు దీనికి ప్రామాణిక కూర్పును సమకూర్చారు. తెలంగాణ విమోచనోద్యమ తీవ్రతను, హైదరాబాద్‌ సంస్థాన రాజకీయ పరిణామాలను, శా సనసభా సంప్రదాయాలను కళ్లకు కట్టిన ఈ గ్రంథం చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఒక అక్షర దర్పణం.ఈ గ్రంథం ఇంతటి ప్రామాణికమైన చారిత్రక దస్త్రంగా రూపుదిద్దుకోవడానికి ప్రధాన బలం రచయిత పూర్ణబోధ శ్రీకాంత్‌, శ్రీపాద శ్రీనివాసుల మధ్య ఉన్న అంతర్గత సమన్వయం. తెలంగాణ శాసనసభలో ని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సి.ఎల్‌.పి.) కార్యాలయంలోనే దశాబ్దాల పాటు కలిసి విధులు నిర్వర్తించిన కార్యాలయ సహచరులుగా వారిద్దరికీ శాసనసభా ప్ర క్రియలు, అక్కడి రికార్డులు, దస్త్రాల ప్రాధాన్యతపై పరిపూర్ణమైన పట్టు ఉంది. పొందుపరిచిన నా టి నిజాం ప్రభుత్వ ఉర్దూ ఫర్మానాలు, సిఐడి దస్త్రాలు, అరెస్ట్‌ వారెంట్లు, చారిత్రక లేఖలు, అరుదైన ఛాయాచిత్రాలను పకడ్బందీ క్రమపద్ధతిలో అమర్చడంలో కూ ర్పుకర్త శ్రీపాద శ్రీనివాసు ప్రతిభ స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. కేవలం జీవిత చరిత్ర శైలిలో కాకుండా, ఒక ప్రామాణిక రిఫరెన్స్‌ గ్రంథంగా పాఠకుల ముందుకు తీసుకురావడంలో వీరిద్దరి కార్యాలయ అనుభవం, విషయ పరిజ్ఞానం పుస్తకానికి విశేషమైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.గ్రంథ అంతరంగావిష్కరణ ఉద్యమ ప్రస్థానం నుండి ప్రజాస్వామ్య రథం దాకా :-1. పదిహేడేళ్ల చిరుప్రాయంలోనే విప్లవ ప్రస్థానం:జోగులాం గద్వాల సంస్థానంలో సంగీత విద్వాంసులైన శ్రీ వెంకోబాచార్యుల ఇంట జన్మించిన పి.ఎన్‌. మూర్తి, వాణిజ్య శాస్త్రంలో డిప్లొమా పూర్తవగానే వచ్చిన ఉద్యోగావకాశాలను తృణప్రాయంగా తిరస్కరించారు. కేవ 17 ఏళ్ల ప్రాయంలోనే (1944 ప్రాంతంలో) దేశ విముక్తికై ఇంటిని, కన్నవారిని విడిచి ఉద్యమ బాట పట్టారు. గద్వాల, అలంపూరు ప్రాంతాల్లో ‘యువక విజ్ఞాన సమితి’ ఆధ్వర్యంలో గ్రంథాలయోద్యమాన్ని నడిపిస్తూ గ్రామగ్రామాన యువతలో రాజకీయ, సా మాజిక చైతన్యాన్ని రగిలించారు. నిరంకుశత్వంపై పోరాటం కర్నూలు సరిహద్దు శిబిరం:రజాకార్ల అకృత్యాలు మితిమీరిన కాలంలో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ పిలుపు మేరకు పి.ఎన్‌. మూర్తి కర్నూ సరిహద్దు అండర్‌ గ్రౌండ్‌ క్యాంపులో అసిస్టెంట్‌ ఆఫీస్‌ సెక్రటరీగా చేరారు. పాగా పుల్లారెడ్డి, డి.కె. సత్యారెడ్డి వంటి ఉద్ధండులతో భుజం కలిపి రహస్య కార్యకలాపాలను నిర్వహించారు. సరిహద్దు కార్యాల యం నుంచి ‘భాగ్యనగర రేడియో’ ప్రసారాలకు అవసరమైన క్షేత్రస్థాయి సమాచారాన్ని ప్రాణాలకు తెగిం సేకరించేవారు. రైలు మార్గంలోని కీలక స్టేషన్లలో గుప్త పద్ధతిలో కాంగ్రెస్‌ బులిటె నిషేధిత కరపత్రాలు బట్వాడా చేసే అత్యంత ప్ర మాదకర బాధ్యతను సమర్థవంతంగా మోశారు. భోజనం, రాత్రి వేరుశెనగ గింజలు తింటూ రోజు తరబడి ఆకలిని సైతం లెక్కచేయకుండా ఉద్యమ నిధులను సేకరించిన తీరు పాఠకుల హృదయాలను ద్రవింపజేస్తుంది. ప్రభుత్వం హైదరాబాద్‌ సె యాక్ట్‌ సెక్షన్‌ 25 కింద జారీ చేసిన రహస్య డిటెన్షన్‌ ఆర్డర్లు, సిఐడి దస్త్రాలే ఆయన పోరాట తీవ్రతకు ప్రత్యక్ష నిదర్శనాలు. అందుకే ప్రఖ్యాత రచయిత డా.దాశరథి రంగాచార్యులు సైతం ఆయన్ను ‘అనేక కష్టనష్టాలకు గురైన కాకలుతీరిన యోధుడు‘ అని ప్రశంసించారు. పంథాలో నవసమాజ నిర్మాణం:1948 సెప్టెంబర్‌ ‘పోలీస్‌ యాక్షన్‌’తో హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి లభించినప్పటికీ, మూర్తి విశ్రమించలేదు. స్వాతంత్య్రానంతరం అసలైన సమా నిర్మాణం మొదలవుతుందని నమ్మి ప్రా ంతంలో అస్పృశ్యత నిర్మూలన, హరిజనోద్ధరణ, వయోజన విద్యా రాత్రి పాఠశాలలు, చరఖా కేంద్రాల నిర్వహణ, జాతీయ సమైక్యత కోసం హిందీ భాషా ప్ర అహర్నిశలు శ్రమించి నిఖార్సయిన గాంధేయవాదిగా నిలిచారు.నాలుగున్నర దశాబ్దాల సి.ఎల్‌. ప్రస్థానం రాజకీయాలకు ‘వారధి’:1952లో హై స్టేట్‌ ప్రథమ శాసనసభ మొదలుకొని 1996 వరకు సుదీర్ఘంగా 43 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సి.ఎల్‌.పి.) కార్యాలయ కార్యదర్శిగా పి.ఎన్‌. మూర్తి అందించిన సేవలు భార పార్లమెంటరీ చరిత్రలోనే అరుదైనవి. రా మకృష్ణారావు, టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, దామోదరం సం జీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి. నరసింహారా వు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి వంటి 19 మంది ముఖ్యమంత్రులు, శాసనసభా పక్ష నేతల పాలనా శైలులకు ఆయన నిశ్శబ్ద సాక్షిగా నిలిచారు. విశ్వాసానికి ప్రతీ పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం అత్యంత గోప్యమైన పాలనా దస్త్రాలను మంత్రుల సైతం తెలియకుండా సి.ఎల్‌.పి. కార్యాలయంలోని మూర్తి ఏకాంతంగా కూర్చుని పరిశీలించేవారన్న వాస్తవం ఆయన నిజాయితీకి, విశ్వసనీయతకు నిదర్శనం.శ్రీశైలం ప్రాజెక్టు సాధన, పంచాయతీ రాజ్‌ వ్యవస్థ ఆవిర్భావం, చరిత్రాత్మక భూసంస్కరణలు, సింగూరు ప్రాజెక్టుల రూపకల్పన, సంపూర్ణ మద్యనిషేధం వంటి ఎన్నో చారిత్రక పరిణామాల నేపథ్యంలో శాసనసభ్యులకు విలువైన సమాచారాన్ని, సలహాలను అందిస్తూ వ్యవస్థకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు.రసజ్ఞత నిండిన బహుముఖ ప్రజ్ఞ: రాజకీయ పరిపాలనా వ్యవహారాల నడుమ కూడా ఆయన తనలోని క ళాతృష్ణను సజీవంగా ఉంచుకున్నారు. రంగస్థల నటుడిగా ‘శ్రీకృష్ణ రాయబారం’, ‘శ్రీకృష్ణ తులాభారం’ నా టకాల్లో శ్రీకృష్ణుడి పాత్రను అద్భుతంగా పోషించి మె ప్పించారు. స్వయంగా రచయితగా మారి ‘తెలుగుదేశంలో స్వాతంత్య్రోద్యమం’, ‘సంక్షిప్తంగా ఆంధ్రప్రదే శ్‌ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ’ అనే విలువైన గ్రంథాలను రచించి భావితరాలకు చరిత్రను అందించారు.‘వారధి’ పుస్తకం కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు, అది ఒక తరం బాధ్యతను మరో తరానికి అందించే వారసత్వ పత్రం. ‘అని అన్నారు. స్వాతం త్య్ర సమర గాథలను, తెలంగాణ విమోచన పోరాటపు నెత్తుటి జ్ఞాపకాలను, ప్రజాస్వామ్య వ్యవస్థల అంతర్గత పరిణామ క్రమాలను లో అధ్యయనం చేయాలనుకునే సరికొత్త తరానికి, పరిశోధకులకు, ప్రజాప్రతినిధులకు ‘వారధి’ ఒక అ కరదీపిక. ఒక మహనీయుని శతజయం తి వేళ పోరాటాన్ని, నిశ్శబ్ద సేవలను భావితరాలకు సజీవంగా అందించిన పూర్ణబోధ శ్రీకాంత్‌ రచన, శ్రీపాద శ్రీనివాసు సమగ్ర కూర్పు తెలుగు సా హిత్య, చారిత్రక రంగాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.