Skip to content
ప్రపంచం వార్తలు

FIFA World Cup 2026 Final: ఫిఫా వరల్డ్ కప్ 2026 విశ్వ విజేతగా స్పెయిన్.. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గుండెపోటు లాంటి ఓటమి.. మెస్సీకి భావోద్వేగ వీడ్కోలు..

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
FIFA World Cup 2026 Final: ఫిఫా వరల్డ్ కప్ 2026 విశ్వ విజేతగా స్పెయిన్.. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గుండెపోటు లాంటి ఓటమి.. మెస్సీకి భావోద్వేగ వీడ్కోలు..

FIFA World Cup 2026 Final: ఫిఫా వరల్డ్ కప్ 2026 విశ్వ విజేతగా స్పెయిన్.. డిఫెండిండ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గుండెపోటు లాంటి ఓటమి.. మెస్సీకి భావోద్వేగ వీడ్కోలు..

FIFA World Cup 2026 Final: న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్‌ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరులో యూరోపియన్‌ కింగ్‌ స్పెయిన్‌ సరికొత్త చరిత్రతను లిఖించింది. 16 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెస్సీ నాయకత్వంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్‌ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. తొలిసారి 2010లో చాంఫియన్ అయిన స్పెయిన్ తరువాత 16 ఏళ్లకు కప్ ను ముద్దాడింది.

ఈ చరిత్రాత్మక విజయంతో పురుషుల, మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టైటిళ్లను ఒకేసారి కైవసం చేసుకున్న తొలి దేశంగా స్పెయిన్‌ రికార్డు సృష్టించింది. మరోవైపు కప్పు నెగ్గి కెరీర్‌ను ఘనంగా ముగించాలనుకున్న అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ పోరాటం కన్నీళ్లతో ముగిసింది.

భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో స్పెయిన్ ఫార్వర్డ్స్ బేనా, ఓల్మో, లామిన్ యమాల్‌లు వరుస దాడులతో హోరెత్తించినా.. అర్జెంటీనా గోల్‌ కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌ అడ్డుగోడలా నిలిచి గోల్స్ ను అడ్డుకున్నాడు. నిర్ణీత సమయంలో అర్జెంటీనా కనీసం ఒక్క షాట్‌ కూడా టార్గెట్‌ వైపు కొట్టలేకపోయింది. మ్యాచ్ ఇంజూరీ టైమ్‌లో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్‌ రెడ్‌ కార్డ్‌ (రెండో ఎల్లో కార్డ్) అందుకుని మైదానాన్ని వీడడంతో అర్జెంటీనా 10 మందితోనే ఆడాల్సి వచ్చింది.

నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు చేరింది. ఎక్స్‌ట్రా టైమ్ మొదటి హాఫ్‌లో మైకెల్ మెరినో ఫౌల్ కారణంగా నికో విలియమ్స్ కొట్టిన గోల్‌ను రిఫరీ నిరాకరించాడు. అయితే 106వ నిమిషంలో నికో విలియమ్స్‌ ఎడమ వైపు నుంచి అందించిన అద్భుతమైన క్రాస్‌ను అందుకున్న ఫెర్రన్‌ టోరెస్‌.. కీపర్ మార్టినెజ్, ముగ్గురు డిఫెండర్లను ఛేదిస్తూ బుల్లెట్ లాంటి గోల్ కొట్టి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అదే విన్నింగ్ గోల్‌గా నిలిచి స్పెయిన్‌ను రారాజుగా నిలబెట్టింది.

టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఫ్రాన్స్ సారథి కిలియన్ ఎంబీప్పే వరుసగా రెండోసారి గోల్డెన్‌ బూట్‌ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేయడంతో ఈ ఎడిషన్‌లో అతని మొత్తం గోల్స్ సంఖ్య 10 (4 అసిస్ట్‌లు)కు చేరింది. తద్వారా ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా (22 గోల్స్) ఎంబీప్పే రికార్డు సృష్టించాడు. ఈ రేసులో మెస్సీ 8 గోల్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచకప్‌ గెలిచిన స్పెయిన్‌ జట్టుకు రూ. 481 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనాకు రూ. 317 కోట్లు లభించాయి.

టోర్నీ రికార్డులు ఇవే:
ఈ మెగా టోర్నీ మొత్తంలో స్పెయిన్‌ కేవలం ఒక్క గోల్‌ మాత్రమే సమర్పించుకుంది. ఫిఫా చరిత్రలో ఏ విజేత జట్టుకూ ఈ రికార్డు లేదు.
ఈ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో నమోదైన మొత్తం గోల్స్‌ సంఖ్య 308. సాకర్‌ ప్రపంచకప్‌ చరిత్రలోనే ఇది అత్యధికం (గత రికార్డు 172 గోల్స్). మ్యాచ్‌కు సగటున 2.98 గోల్స్ నమోదయ్యాయి. ఇది 1958 తర్వాత నమోదైన అత్యుత్తమ సగటు.