Skip to content
వినోదం వార్తలు

‘మా రాముడు అందరివాడు’లో సిఎంగా సుమన్‌

Prajapaksham 03 Sep 2026 0 నిమిషాల పఠనం వినోదం
‘మా రాముడు అందరివాడు’లో సిఎంగా సుమన్‌

Suman

అనుముల ప్రొడక్షన్స్‌, శ్రీరామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్‌, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్‌, సమ్మెట గాంధీ, నాగ మహేష్‌, బాహుబలి ప్రభాకర్‌ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 4న థియేట్రికల్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది.ఈ సందర్భంగా నటుడు సుమన్‌ మాట్లాడుతూ ‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్‌ కంటే టాలెంట్‌ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్‌ ఉంది. డ్యూయెల్‌ రోల్‌లో ఆయన పెర్ఫార్మెన్స్‌ బాగా చేశారు. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్‌ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్‌ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్‌. నిర్మాత లక్ష్మణ్‌ ఇందులో విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్‌ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని అన్నారు.నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్‌ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్‌ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి అరాచకంగా ఆ ఊరిని ఎలా కంట్రోల్‌ పెట్టుకుంటాడనేది నా క్యారెక్టర్‌. సుమన్‌ ఇందులో సీఎంగా నటించారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ అలరిస్తాయి. మారెడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్‌ చేశాం. మనీష్‌ కుమార్‌ మ్యూజిక్‌ అందించిన నాలుగు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 200పైగా థియేటర్స్‌లో సెప్టెంబర్‌ 4న ప్రేక్షకులముందుకు రాబోతున్నామని అన్నారు.దర్శకుడు యుద్ధనపూడి మైకిల్‌, నిర్మాత వెంకట్‌ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ , హీరో శ్రీరామ్‌ , హీరోయిన్‌ స్వాతి మందాడి తదితరులు పాల్గొన్నారు.