Skip to content
వినోదం వార్తలు

‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ రిలీజ్‌

Prajapaksham 03 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ రిలీజ్‌

Sardar 2

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన ‘సర్దార్‌’ మోస్ట్‌ అవైటెడ్‌ సీక్వెల్‌ ‘సర్దార్‌ 2’తో సెప్టెంబర్‌ 10న వరల్డ్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించారు. సర్దార్‌తో ఏర్పడిన స్పై యూనివర్స్‌ను మరింత పెద్ద కాన్వాస్‌పైకి తీసుకెళ్లిన ఈ సీక్వెల్‌లో డేంజర్‌, కాన్ల్పిక్ట్‌, యాక్షన్‌ నెకస్ట్‌ లెవల్‌ కి వెళ్ళిందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. గతంలో జరిగిన సంఘటనలను, ప్రస్తుతం ఎదురవుతున్న ప్రమాదాన్ని కలిపి కథను ప్రజెంట్‌ చేయడం అద్భుతంగా ఉంది. కార్తీ మరోసారి రెండు విభిన్న పాత్రలతో అదరగొట్టారు. తండ్రి, కొడుకులను లుక్స్‌, మేనరిజమ్స్‌, బాడీ లాంగ్వేజ్‌తో చాలా డిఫరెంట్‌గా చూపించారు. ముఖ్యంగా యంగ్‌ సర్దార్‌గా కార్తీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆకట్టుకుంటోంది. విజయ్‌ పాత్రలో మరో డిఫరెంట్‌ ఎనర్జీ కనిపిస్తోంది. ఎస్‌.జే. సూర్య విలన్గా ఇంటెన్స్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన అనూహ్యమైన బిహేవియర్‌ కథలో టెన్షన్‌ను మరింత పెంచుతోంది. మాళవిక మోహనన్‌, ఆశికా రంగనాథ్‌, రజిషా విజయన్‌, అచ్యుత్‌ కుమార్‌, యోగిబాబు ప్రధాన పాత్రల్‌లో నటిస్తున్నారు. జార్జ్‌ సి. విలియమ్స్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు స్లిక్‌, ఎక్స్‌పాన్సివ్‌ విజువల్‌ స్టైల్‌ను తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్‌ లొకేషన్స్‌తో పాటు హై-ఆక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను భారీ స్కేల్లో చూపించారు. సామ్‌ సీఎస్‌ ఎలక్ట్రిఫైయింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టెన్షన్‌ను మరింత పెంచింది. కీలక సన్నివేశాలకు బిజిఎం మంచి ఇంటెన్సిటీని ఇచ్చింది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.