యెష నాగుల కట్ట కింద ఊగుతున్న కీర్తినాని
Nani New Movie
నాని హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్’.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యెష నాగుల’ ను రిలీజ్ చేశారు. జానపద బాణీకి అనిరుధ్ తనదైన హై-ఎనర్జీ మ్యూజిక్‌ను జోడించిన ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ కాన్సర్ట్‌లో లైవ్‌గా విడుదల చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య పాటను లైవ్‌లో ప్రదర్శించారు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పాట మూడ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. లైవ్లీగా, క్యాచీగా సాగుతూ పక్కా జానపద నేటివిటీని ప్రజెంట్ చేశాయి. జంగి రెడ్డి వోకల్స్ పాటకు రస్టిక్ టచ్‌ను అందించగా, ప్రభా తన వోకల్స్ పాటలోని ఎనర్జీని మరింత పెంచారు. ఆట సందీప్ రిథమ్‌కు అనుగుణంగా ఫోక్ మూవ్‌మెంట్స్, మాస్ డ్యాన్స్ స్టెప్‌్ీను మేళవిస్తూ కొరియోగ్రఫీ అందించారు. పాటను కలర్‌ఫుల్‌గా, ఎనర్జిటిక్‌గా ప్రజెంట్ చేయడంతో మ్యూజిక్‌తో పాటు విజువల్‌గానూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. నాని, కీర్తి సురేష్ డ్యాన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికే రెండు పాటలు మ్యూజికల్‌గా మంచి బజ్‌ను క్రియేట్ చేయడంతో ‘ది ప్యారడైజ్’ ఆల్బమ్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవోపీ సిహెచ్ సాయి, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 24న పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
- CJP Protest Assault Case: జంతర్‌మంతర్ దాడి కేసులో కీలక పరిణామం.. స్వతంత్ర భరద్వాజ్ పోలీసుల అదుపులోకి..
- Konda Surekha Controversy: నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, మారే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన కొండా సురేఖ..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని వినతి..
- Konda Surekha Controversy: కొండా సురేఖను పదవి నుంచి తొలగించడం బాధాకరమైన విషయమే.. స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
- One Last Kiss: ఎనిమిదేళ్ల బంధానికి భావోద్వేగ వీడ్కోలు.. చివరి ముద్దు ఇచ్చి కన్నీళ్లు పెట్టుకున్న బస్సు డ్రైవర్.. స్పందించిన కేరళ సీఎం..
- Tamil Nadu: మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి యత్నం.. కామాంధుడిని తరిమి తరిమి కొట్టిన వీధి కుక్కలు.. వీడియో ఇదిగో..