Skip to content
బిజినెస్ వార్తలు

Credit Score Complete Guide: సిబిల్ స్కోర్ అంటే ఏంటి… ఎలా చెక్ చేసుకోవాలి..? A to Z వివరాలు మీకోసం..

Prajapaksham 08 Jul 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
Credit Score Complete Guide: సిబిల్ స్కోర్ అంటే ఏంటి… ఎలా చెక్ చేసుకోవాలి..? A to Z వివరాలు మీకోసం..

Credit Score Complete Guide: సిబిల్ స్కోర్ అంటే ఏంటి... ఎలా చెక్ చేసుకోవాలి..? A to Z వివరాలు మీకోసం..

క్రెడిట్ స్కోర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో తప్పనిసరి అని చెప్పవచ్చు. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ ఆధారంగానే ఇప్పుడు బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయి. అంతేకాదు, క్రెడిట్ స్కోర్ చూసి చాలా మంది ఉద్యోగ ఇంటర్వ్యూలలో సైతం అడిగే అవకాశం ఉంది. ఆ మధ్యకాలంలో ఒక పెళ్లికూతురు తనకు కాబోయే భర్త క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని రిజెక్ట్ చేసిన సందర్భం కూడా చూడవచ్చు. ప్రస్తుతం క్రెడిట్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని క్రెడిట్ స్కోర్ అనేది అత్యవసరమైన సంగతి గుర్తుంచుకోవాలి.

క్రెడిట్ స్కోర్ అనేది క్రెడిట్ ఏజెన్సీలు అందించే ఒక ప్రామాణిక స్కోర్. అందులో మీ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించి, మీరు క్రమశిక్షణతో లోన్స్ చెల్లింపులు జరుపుతున్నారా లేదా అని మీ ఖాతాలను సమీక్షిస్తారు. మీరు అన్ని సరిగ్గా లావాదేవీలను నిర్వహించినట్లయితే క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పటికప్పుడు నెలసరి వాయిదాల చెల్లింపులు చేయకుండా ఉన్నట్లయితే, మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. మీరు ఆర్థిక క్రమశిక్షణ కనుక పాటిస్తూ, ఎప్పటికప్పుడు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను నిర్ణయిత గడువు తేదీలోగా చెల్లింపులు చేసినట్లయితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అప్పుడు మీరు కొత్తగా లోన్లు అప్లై చేసుకున్నప్పుడు అప్రూవల్ పొందే అవకాశం ఉంటుంది.

సిబిల్ స్కోరు అంటే ఏంటి..?

సిబిల్ సంస్థ ఇచ్చే క్రెడిట్ స్కోర్ అని పిలుస్తారు. సాధారణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలన్నీ కూడా ఎక్కువగా సిబిల్ సంస్థ అందించే క్రెడిట్ స్కోర్‌ను ప్రామాణికంగా భావిస్తుంటాయి. అందుకే చాలా మంది క్రెడిట్ స్కోర్‌ను సిబిల్ స్కోర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బ్యాంకులన్నీ కూడా ఎక్కువగా మీ పాన్ కార్డు ఆధారంగా సిబిల్ స్కోర్‌ను చెక్ చేస్తూ ఉంటాయి. ఇది 200 నుంచి 900 పాయింట్ల వరకు ఉంటుంది. సాధారణంగా 750 నుంచి 900 వరకు సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే మీకు రుణ అర్హత అనేది పెరుగుతుంది. 750 పాయింట్ల కన్నా తక్కువగా ఉన్నట్లయితే రుణ అర్హత తగ్గుతుంది. ఇక 600 పాయింట్ల కన్నా మరింత తగ్గిపోయినట్లయితే రుణ అర్హత దాదాపు ఉండదు. లేదా అధిక వడ్డీకి రుణాలను పొందాల్సి ఉంటుంది. సిబిల్ స్కోర్ కనుక చక్కగా ఉన్నట్లయితే, మీకు ఎలాంటి తనఖా లేకుండానే పర్సనల్ లోన్స్ లభించే అవకాశం ఉంది.

సిబిల్ స్కోర్ ఎలా మొదలవుతుంది..?

సాధారణంగా సిబిల్ స్కోర్ మీరు ఏదైనా ఒక క్రెడిట్ తీసుకోవడం ద్వారా ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు, మీరు క్రెడిట్ కార్డు కనుక తీసుకొని ఎప్పటికప్పుడు చెల్లింపులను చేసినట్లయితే, సిబిల్ స్కోర్ ప్రారంభమై చక్కగా మెయింటైన్ అవుతుంది. లేదా బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ కానీ, వెహికిల్ లోన్ కానీ తీసుకున్నట్లయితే మీకు సిబిల్ స్కోర్ ప్రారంభం అవుతుంది.

సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా..?

సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే ముందుగా మీరు ఎప్పటికప్పుడు మీరు తీసుకున్న రుణ చెల్లింపులను సమయానికి చెల్లిస్తూ ఉండాలి. ఒక వాయిదా కనుక మిస్ చేసినట్లయితే, మీకు సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. అప్పుడు మీకు భవిష్యత్తులో రుణాలు లభించే అవకాశం తగ్గుతుంది. మీరు కంటిన్యూగా 6 నెలలు లేదా ఏడాది పాటు మీరు తీసుకున్న రుణాలు అన్నింటికీ వాయిదా చెల్లింపులను సకాలంలో, సక్రమంగా చేసినట్లయితే సిబిల్ స్కోర్ చక్కగా పెరిగే అవకాశం ఉంటుంది.

సిబిల్ స్కోర్ తగ్గితే ఎలా…?

సిబిల్ స్కోర్ కనుక తగ్గిపోయినట్లయితే, మీరు భవిష్యత్తులో హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నా, లేదా కారు లోన్ లేదా టూ వీలర్ లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే, అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ట్యాగ్‌లు: business news cibil score